Wife hits the lover of her husband at airport అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మహిళల సిగపట్లు..

Wife hits the lover of her husband at airport suspecting illicit affair

journalist, husband, lover, husband, illegal affair, bhubaneshwar, international airport, viral news, viral video, odisha

A woman who is reportedly a journalist got hold of another lady who she claimed having an affair with her husband and thrashed her in public.

అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద మహిళల సిగపట్లు..

Posted: 08/19/2017 06:02 PM IST
Wife hits the lover of her husband at airport suspecting illicit affair

నా మొగుడు నాకే సొంతం.. అన్న కాంసెప్టుతో ఓ భార్య తన భర్త ప్రియురాలితో ఘర్షణకు దిగిన వైనంమిది. ఈ తరహా ఘటనలు మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో అధికంగా కనబడతాయి. కానీ ఏకంగా ఉన్నతవర్గాల్లోనూ ఈ ఘటనలు చోటుచేసుకోవడం.. అందులోనూ ఏకంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే రొడ్డు మార్గంలో జరగడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఓ మహిళ మరో మహిళను నడిరోడ్డు మీద జుట్టు పట్టి జాడించేసింది. ఇదంతా స్థానిక బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో జరిగింది. దీంతో నగరంలో ఈ సంఘటన వాడిగా వేడిగా చర్చకు దారితీసింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మరో మహిళపై అకస్మాత్తుగా భార్య బహిరంగ దాడికి దిగడంతో అంతా అవాక్కయ్యారు. వీరిలో ఒకరు పాత్రికేయులు కావడంతో గొడవ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యాధికులు ఇలా వీరంగానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

పెళ్లికి ముందు నుంచే కొనసాగుతున్న వివాహేతర సంబంధం గురించి తదుపరి దశలో తెలిసిన తరువాత భర్తకు పలు విధాలా భార్య నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. కొద్ది కాలం గడువు ఇస్తే ఈ సంబంధానికి తెర దించేస్తానని తరచూ భర్త బూటకపు హామీలు ఇస్తూ యథాతథంగా వివాహేతర సంబంధం  కొనసాగించడాన్ని సహించలేకపోయినట్లు భార్య వాపోయింది.  దీనిపై నగర పోలీసు డిప్యుటీ కమిషనర్‌ సత్యబ్రొతొ భొయి స్పందించి బాధిత వర్గం ఫిర్యాదు చేయనంత వరకు చేసేదేమీ ఉండదన్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కోసం అభ్యర్థన దాఖలైతే రాజీ కుదిర్చేందుకు మధ్యమ విభాగానికి సిఫారసు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : journalist  husband  lover  husband  illegal affair  bhubaneshwar  international airport  viral news  viral video  odisha  

Other Articles