కలెక్టర్ చెల్లితో మాజీ ఎమ్మెల్యే కొడుకు లవ్ అఫైర్.. ఆపై మిస్సింగ్ | IAS Officer Sister Missing Ex MLA Son Arrested

Doctor surya kumari missing case

Suryakumari Missing, AP Doctor Missing, IAS Officer Sister Suryakumari, IAS Sister Missing, Doctor Suryakumari Missing Case, Suryakumari Vidyasagar, Jayaraj Son Vidyasagar, Suryakumari Vidyasagar Missing, Doctor Suryakumari Missing Case

IAS Officer's Sister suryakumari Missing in Vijayawada. Police took Ex MLA Jayaraj's Son Vidyasagar Into Custody. Vidyasagar Wife clarity on suryakumari missing.

మిస్టరీగా సూర్యకుమారి కహానీ

Posted: 08/03/2017 11:21 AM IST
Doctor surya kumari missing case

ఆంధ్రప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారి చెల్లెలు రెండు రోజులుగా కనిపించకుండా పోవటం సంచలనంగా మారింది. ఆమె అదృశ్యం వెనుక మాజీ ఎమ్మెల్యే తనయుడి హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తుండటం విశేషం. పెళ్లైందన్న విషయాన్ని దాచి ఆ యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడని, తీరా విషయం తెలిశాక నిలదీయటంతో ఆమెను మాయం చేసి ఉంటాడన్న అనుమానాలు ఆమె తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు.   వీడియో కోసం క్లిక్ చేయండి

కర్ణాటక క్యాడర్ కలెక్టరుగా పనిచేస్తున్న అధికారి చెల్లెలె సూర్యకుమారి విస్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్ ను ప్రేమించింది. అయితే అతనికి ఇప్పటికే వివాహం అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం సూర్యకుమారికి తెలియటంతో రెండు రోజుల క్రితం అతని ఇంటికి వెళ్లి నిలదీసింది. అప్పటి నుంచే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో సూర్యకుమారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

సూర్య కుమారి తమ ఇంటికి వచ్చిన మాట నిజమేనని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయిందని విద్యాసాగర్ తల్లి చెబుతోంది. అర్థరాత్రి 1.40 గంటలకు సూర్యకుమారి తన ఇంటికి వచ్చిందని, కాసేపు మాట్లాడి పంపించానని ఆయన చెబుతున్నట్టు తెలుస్తోంది. ఓ కలెక్టర్, ఓ మాజీ ఎమ్మెల్యేల కుటుంబాల మధ్య కేసు కావడంతో పోలీసులు రహస్యంగా విచారిస్తున్న క్రమంలో మీడియా కంటపడి వెలుగులోకి వచ్చింది. పోలీసులు విద్యాసాగర్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Suryalumari Missing Case

"బాబీ నిన్ను ఎంత ఇష్టపడ్డానో. నన్ను పెళ్లి చేసుకోవాలని నీ వెంట పడ్డాను. నువ్వు వద్దన్నా నిన్ను బలవంతం చేశాను. ఇంట్లో మా వాళ్లకు అన్నీ తెలిశాయి. ఇప్పుడు నన్ను ఎక్కడికైనా, నీ నుంచి దూరం తీసుకెళ్లి పోవాలని ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. వాళ్ల మూవ్ మెంట్ ని బట్టి నేను అలర్ట్ గా ఉంటాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒకవేళ నన్ను తీసుకెళ్లిపోయినట్టు నీకు తెలిస్తే, నీ లైఫ్ ని రిస్క్ లో పెడతారేమో చాలా జాగ్రత్తగా ఉండు" అంటూ తన అదృశ్యానికి ముందు సూర్యకుమారి పెట్టిన మెసేజ్ కలకలం రేపుతోంది. కాగా, సూర్యకుమారి అదృశ్యం ఇప్పుడు మిస్టరీగా మారగా, ఆమె ఎక్కడుందో పోలీసులు కనిపెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


వాళ్ల సంబంధం తెలుసు: విద్యాసాగర్ భార్య

సూర్యకుమారి తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కోడలు, విద్యాసాగర్ భార్య వెల్లడించింది. ఆపై ఓ పావుగంట తరువాత వెళ్లిపోయిందని, ఆ అమ్మాయిని ఇంట్లో దించి వస్తానని తన భర్త కూడా వెనకాలే వెళ్లాడని ఆమె అంటోంది. అసలేం జరిగిందో తెలీకుండా తన భర్తను అరెస్ట్ చేశారని, ఆయన్ను ఎందుకు తీసుకెళ్లారో, ఎక్కడ పెట్టారో తెలియడం లేదని, తన భర్త పరిస్థితిపై ఆందోళనగా ఉందని వాపోయారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే ఉండి వచ్చానని చెప్పిన ఆమె, తన భర్తను క్షేమంగా అప్పగించాలని కోరింది. ఆమె తన ఫోన్ ను భర్తకు ఇచ్చి వెళ్లిందని మీడియాకు వెళ్లడించింది. తన భర్తకు ఓ యువతితో సంబంధం ఉందని తనకు ఒక సంవత్సరం క్రితమే తెలిసిందని, అయితే, అది సూర్యకుమారితోనేనన్న విషయం మాత్రం తెలియదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  Suryakumari  Missing Case  Vidyasagar  

Other Articles

Today on Telugu Wishesh