xiaomi Redmi Note 4 explosion caught on cam షియోమీ రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది.. ఇలా

Xiaomi redmi note 4 explosion caught on camera in banglore

Xiaomi Redmi Note 4 Exploded, Redmi Note 4 Exploded, Note 4 Exploded, Xiaomi Redmi Note 4 India, Redmi Note 4 Explosion, Redmi Note 4 India, Redmi note 4 explosion, Xiaomi, Xiaomi Redmi Note 4, Redmi, Xiaomi Redmi, Redmi Note 4, Redmi Note 4 explosion, Mi Home Store, Samsung

A Xiaomi Redmi Note 4 allegedly exploded and burst into flames in a Bengaluru store, reports suggest.

ITEMVIDEOS: షియోమీ రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ పేలింది.. ఇలా

Posted: 07/24/2017 06:53 PM IST
Xiaomi redmi note 4 explosion caught on camera in banglore

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ ఇటీవల విడుదల చేసిన రెడ్‌మీ నోట్4 స్మార్ట్‌ఫోన్ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే కొనుగోలు చేసి వాడుతున్న వారు ఇకపై అప్రమత్తంగా వుండాల్సిన చేదు వార్త ఇది. ఎందుకంటారా..? బెంగళూరులోని ఓ మొబైల్ షోరూంలోనే ఈ స్మార్ట్ ఫోన్ పేలిపోవడం కలకలం రేపుతోంది. సిమ్ కార్డు వేసేందుకు షాపు నిర్వాహకుడు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరు నగరానికి చెందిన అర్జున్ అనే వినియోగదారుడు స్థానికంగా ఉన్న ఓ పూర్వికా మొబైల్ స్టోర్ నుంచి రెడ్‌మీ నోట్4 స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లిన అతడికి అందులో సిమ్‌కార్డ్ పెట్టడం ఇబ్బందిగా మారింది. దీంతో తిరిగి పూర్వికా మొబైల్ షోరూంకు వచ్చి సిమ్ పెట్టాల్సిందిగా కోరాడు. దీంతో షోరూంలోని టెక్నీషియన్ ఆ ఫోన్ సిమ్ కార్డులను ఉంచే స్లాట్ తీసి సిమ్ పెట్టేందుకు ప్రయత్నించాడు.

అలా స్టాట్ ను ఓపెన్ చేసేందుకు పిన్ ను పెట్టిపెట్టగానే ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ నుంచి మంటలు వచ్చి మొబైల్ ఫోన్ పేలిపోయింది. కిందపడిన ఫోన్ నుంచి ఇంకా మంటలు వస్తూనే వుండగా, షాప్ లో ప్రమాదం సంభవిస్తుందన్న భయంతో టెక్నీషియన్ ఫోన్ లోని మంటలను తన కాలితో పదే పదే తోక్కి అర్పేశాడు. అయితే అదృష్టం బాగుండి.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ పేలిన ఘటనపై అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ పేలిన ఘటన సమాచారం అందుకున్న సంస్థ వినియోగదారుడి కొత్త ఫోన్ ను అందించింది. వినియోగదారుల భద్రతే తమ ప్రథమ లక్ష్యమని, బాధిత వినియోగదారుడిని కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని పేర్కొంది. రెడ్ మీ నోట్ 4 ఫోన్ పేలిన ఘటన దృశ్యాలను మీరూ చూడండి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : redme note 4  xiaomi  Explosion  arjun  banglore  India  

Other Articles