Collector orders kidnap case on Students Unions కలెక్టర్ అదేశాలపై షాక్.. పోరాట చరిత్రకు పాతర

Sangareddy collector orders kidnap case on students unions

Manickaraj Kannan, collector, sangareddy, students union, protest, dharnas, school childern, hostel students, telangana

Sangareddy Collector Manickaraj Kannan orders kidnap case on Students Unions, who involve government hostel students in protests and dharnas

కలెక్టర్ అదేశాలపై షాక్.. పోరాట చరిత్రకు పాతర

Posted: 07/12/2017 12:41 PM IST
Sangareddy collector orders kidnap case on students unions

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ఉద్యమాల పునాదుల మీద. ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు దేశ స్వాతంత్ర్య సమరం కూడా శాంతియుత ఉద్యమం మేరకే నిర్మితమైంది. ఈ రెండు అటు జాతీయ ఉద్యమం, ఇటు రాష్ట్రీయ ఉద్యమాల చరిత్రలో మనకు అనేక విషయాలు అప్పడప్పడు గుర్తుచేసుకుంటాం, 12 ఏళ్ల ప్రాయంలోనే దేశ్ ముఖ్ ఖాదీవస్త్రాల ప్రదర్శనలో ఏకంగా ప్రధమ ప్రధాని నెహ్రూనే అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ పోరాటం కొనసాగిన తరుణంలో విద్యార్థులు ప్రెజెంట్ అనేందుకు బదులు జై తెలంగాణ అంటూ తమ హాజరును తెలిపిన ఘటనలు మనం చూశాం.

అలాంటి ఉద్యమాల పురటిగడ్డపై ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం జరుగుతుంది. ఇందుకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మాణిక్ రాజ్ కన్నన్ జారీ చేసిన ఉత్తర్వులు అజ్యం పోస్తున్నాయి. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను ర్యాలీలకు.. ఆందోళనలకు.. నిరసనలకు ధర్నాలకు తీసుకెళ్లే విద్యార్థి సంఘాలపై కిడ్నాప్ కేసులు నమోదు చేయాలంటూ ఆయన ఉత్తర్వులు జారీ చేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో కలెక్టర్ ఉత్తర్వులు వున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నా.. విద్యార్థి సంఘాలపై కిడ్నాప్ కేసులు పెట్టే అంశంపై మాత్రం తీవ్ర వ్యతిరేక వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల్ని పాఠశాల దశ నుంచే చైతన్యవంతుల్ని చేయాల్సిన అసవరం ఉందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఉద్యమాల గడ్డగా వెలిసిన రాష్ట్రంలో నిరసనలపై కత్తి పెట్టడం అక్షేపనీయం అన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles