బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అల్టిమేటంకు మిత్రపక్ష అర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. తమతో మిత్రపక్షంగా వుంటూ విపక్షానికి చెందిన బీజేపితో సన్నిహితంగా మెలగడంపై ఆయన నితీష్ సక్కార్ పై అసహనం వ్యక్తం చేశారు. వారికి అనుకూలంగా నితీష్ కుమార్ చర్యలు తీసుకోవడం అర్థరహితమన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన తనయుడు తేజస్వీ యాదవ్ నాలుగు రోజుల్లోగా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయలన్న అల్టిమేటంను లాలూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
ల్యాండ్ ఫర్ హోటల్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ను నాలుగు రోజుల్లో రాజీనామా చేయాలని సీఎం నితీశ్‌కుమార్ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబసభ్యులు, అనుచరులపై సీబీఐ దాడులు నిర్వహించిన నేపథ్యంలో లాలూ తొలిసారి 'ఇండియా టుడే'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. నితీశ్‌కుమార్ క్యాబినెట్ నుంచి డిప్యూటీ సీఎంగా తేజస్వి తప్పుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
తనను, తన పార్టీని రాజకీయంగా ఎదుర్కునే అవకాశం లేక కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అడ్డదారుల్లో అక్రమ కేసులు బనాయించి ప్రతీకారచర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఆర్జేడీని ఫినిష్ చేసేందుకే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుట్ర పన్నారని, అందులో భాగంగానే కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు తమపై దాడులు చేస్తున్నాయని లాలూ ఆరోపించారు. ప్రధానిగా పోటీ చేసే సమయంలో నితీష్ ప్రభుత్వంపై కూడా కుట్రపూరితంగా పలు అరోపణలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇక తేజస్వీ యాదవ్ ను పదవి నుంచి తప్పించేందుకు చేస్తున్న యత్నాలన్ని తప్పని ఆయన కోట్టిపారేశారు. 'హోటల్ ఒప్పందం కుదిరినప్పుడు తేజస్వి మైనర్ గా వున్నాడని, అదీకాక ఆయన క్రికెట్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడని అన్నారు. అతనిపై ఆరోపణలు ఆధారరహితం' అని లాలూ కొట్టిపారేశారు. ఇదిలా వుండగా నిన్న లాలూ కూతురు మిస్బా భారతి ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకాగా, ఇవాళ లాలూ ప్రపాద్ యాదవ్ అల్లుడు శైలేష్ కుమార్ ను హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను అందించింది.
(And get your daily news straight to your inbox)
Mar 02 | తెలంగాణ ఇంటి కోడలినంటూ అదే మెట్టినిల్లు లాజిక్ తో ఇక్కడి రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగప్రవేశం చేయునున్న వైఎస్ షర్మిల ఇప్పటికే జిల్లాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించి, సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. ఇక... Read more
Mar 02 | ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర బెయిల్ ష్యూరిటీ విషయంలో ఆయన ఎదుర్కోంటున్న ఇబ్బందులను ఆయన తరపు సినియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ బాంబే... Read more
Mar 01 | తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి దారుణ హత్యకేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభించాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికాయి. బ్యారేజ్ 53,... Read more
Mar 01 | అత్యచార కేసుల్లో బాధితులను పెళ్లి చేసుకుంటామని హామీ ఇచ్చినా.. లేక మరో విధంగా రాజీ కుదుర్చుకున్నా కేసుల నుంచి మినహాయింపు మాత్రం లభించదని గతంలోనే చెప్పిన దేశసర్వన్నత న్యాయస్థానం ఇవాళ ఓ ప్రభుత్వం ఉద్యోగి... Read more
Mar 01 | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రీల్ 6వ తేదీన ఎన్నికల జరగనున్న తమిళనాడులో ఇవాళ బిజీగా పర్యటించారు. ఇటీవల కేరళలోని కోల్లా జిల్లాలో మత్స్యకారులతో కలసి చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రాహుల్.. వారితో... Read more