SBI Revised IMPS Service Charges ఖాతాదారులకు మళ్లీ చేదు వార్తనందించిన ఎస్బీఐ

After demonetisation again sbi revised service charges post gst

SBI, IMPS Money Transfer, IMPS, SBI IMPS, Money transfer, SBI money transfer, SBI IMPS transfer, State Bank Buddy

After GST, India’s biggest lender State Bank of India (SBI) has revised service charges on ATM withdrawal for users of its mobile app “State Bank Buddy” and various other cash transactions.

ఖాతాదారులకు మళ్లీ చేదు వార్తనందించిన ఎస్బీఐ

Posted: 07/11/2017 03:21 PM IST
After demonetisation again sbi revised service charges post gst

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మరోమారు తన ఖాతాదారులకు చేదువార్తను అందించింది. ఓ వైపు నదగు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని అటు కేంద్రం, ఇటు భారతీయ రిజర్వు బ్యాంకు అదేశాలిస్తున్నా.. పాత నోట్ల రద్దు తరువాత మొబైల్ యాప్, ఇంటర్ నెట్, అన్ లైన్ బ్యాంకింగ్ లలో నగదును బదిలీ చేస్తున్న వారికి కొంత కాలం కింద సర్వీస్ చార్జీల పేరుతో షాక్ విధించిన ఎస్బీఐ.. తాజాగా మరోమారు కూడా ఖాతాదారులకు చేదువార్తను అందించింది.

అన్ లైన్, యాప్ నగదు బదిలీలపై చార్జీలు:-
 
జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఏకీకృత పన్నువిధానం జీఎస్టీ నేపథ్యంలో ఐఎంపీఎస్ (ఇమ్మిడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌) మనీ ట్రాన్సఫర్లపై కొత్త చార్జీలు వర్తిస్తాయని ఎస్బీఐ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. బ్యాంకింగ్‌ సేవలకు జీఎస్టీ 18శాతంగా ఉన్న విషయం తెలిసిందే. కాగా అమల్లోకి వచ్చిన కొత్త చార్జీలు ఇలా వున్నాయి. రూ.1000 కి ఎలాంటి చార్జీలు లేకుండా, రూ.1000 నుంచి రూ.1 లక్ష కు రూ.5+జీఎస్టీ , రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల ట్రాన్సఫర్లకు రూ.15+జీఎస్టీ చార్జీలను ఖరారు చేసింది.

ఏటీయం కార్డుల జారీపై చార్జీలు

కొత్త డెబిట్ కార్డు కావాలని కోరుకునే వారు ఇకపై బ్యాంకుకు డబ్బు చెల్లించాల్సి వుంటుంది. అయితే ఇది జూన్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. కాగా రూపే క్లాసిక్ కార్డుల మాత్రం ఉచితంగా బ్యాంకు అందించనుంది.

పాత నోట్లు మార్పిడిపై చార్జీలు

చెలామణిలో వున్న పాత నోట్లు చిరిగినా.. లేక పాతబడిపోయినా వాటిని మార్చేందుకు కూడా బ్యాంకులు ఇకపై ఖాతాదారుల నుంచి పన్నులతో పాటు చార్జీలను వసూలు చేయనున్నాయి. ఒక ఖాతాదారుడు 20 పాత నోట్ల కన్నా అధికంగా లేదా మొత్తంగా పాడైన నోట్ల విలువ రూ.5 వేలు దాటినా.. రెండు రూపాయల చార్జీతో పాటు పన్నులు కూడా చెల్లించాల్సి వుంటుంది.

చెక్ బుక్ లు పోందేందుకు చార్జీలు

జూన్ 1 నుంచి సాధారణ పొదుపు బ్యాంకు ఖాతా వున్న ఖాతాదారులు పది చెక్కులతో కూడిన చెక్ బుక్ పొందేందుకు రూ. 30 చార్జీతో పాటు జీఎస్టీ పన్ను చెల్లించాల్సివుంటుంది. ఇక 25 చెక్కులతో వున్న చెక్ బుక్ ను పోందేందుకు రూ.75 చార్జీతో పాటు జీఎస్టీ పన్నులు.. 50 చెక్కులతో కూడిన చెక్ బుక్ పోందేందుకు రూ.150 చార్జీతో పాటు జీఎస్టీ పన్నులు కలిపి చెల్లించాల్సి వుంటుంది. అయితే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తూట్లు పోడుస్తుందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.
 
మొబైల్‌ ఫోన్లు లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వెనువెంటనే నగదును బెనిఫిషియరీ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసే నగదు రహిత లావాదేవీలు ప్రోహత్సహించే క్రమంలో భఆగంగా ఈ లావాదేవీలపై ఎలాంటి చార్జీలను వేయకూడదని ఇప్పటికే అభ్యర్థిస్తున్నా.. బ్యాంకు మాత్రం ఈ సరికొత్త నిబంధలను జూన్ 1 నుంచి అమలు చేస్తుండగా, ఇక జీఎస్టీ పేరుతో మారోమారు ఖాతాదారులపై భారం మోపేందుకు సిద్దం కావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles