Gopalkrishna Gandhi as Opposition Vice Presidential candidate గాంధీ కుటుంబం నుంచి యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి

Opposition selects gopalkrishna gandhi as vice presidential candidate

Gopalkrishna Gandhi, vice presidential polls, presidential polls, presidential elections, congress, opposition fields candidate, mahatma gandhi grand son in VP race, Gopalkrishna Gandhi in vice president race, former west bengal governer, politics

Former West Bengal Governor Gopalkrishna Gandhi is the Opposition's pick for the post of vice president

గాంధీ కుటుంబం నుంచి యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి

Posted: 07/11/2017 02:34 PM IST
Opposition selects gopalkrishna gandhi as vice presidential candidate

దేశ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహ్మతాగాంధీజీ కుటుంబానికి చెందిన వ్యక్తిని యూపీఏ సహా మిత్రపక్షాలు ఎంపిక చేసి.. బరిలోకి నిలిపాయి. గాంధీజీ మనవడిగా, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ పేరును విపక్ష పార్టీలు ప్రకటించాయి. ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఇవాళ ఢిల్లీలోని పార్లమెంటు గ్రంధాలయ హాలులో భేటీయై ఆయన పేరును ప్రతిపాదించాయి. దాదాపు 18 పార్టీలు ఏకగ్రీవంగా ఆయన ఎంపికను ఖరారు చేశాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యువనేత రాహుల్ గాంధీ సహా రాష్ట్రపతి ఎన్నికలలో విపక్షాలకు దూరంగా వున్న జనతా దళ్ (యు) కూడా ఈ సమావేశానికి హాజరై గోపాలకృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించడం విశేషం. ఆ పార్టీ తరపున అధ్యక్షుడు శరద్ యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీపీఎం సీతారాం ఏచూరీ, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఓమర్ అబ్దుల్లా, సమాజ్ వాదీ నుంచి నరేష్ అగర్వాల్, బీఎస్సీ నుంచి సతీష్ చంద్రమిశ్రా తదితరులు హాజరయ్యారు.

కాగా తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనకు గతంలోనే పూర్తి మద్దతునిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టాలనే ప్రతిపాదనను కూడా మమత బెనర్జీ తీసుకొచ్చారు. కానీ చివరికి మాత్రం లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ ను ఎంపిక చేశారు. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలుజరగనున్నాయి. అదేరోజు ఫలితాల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 19తో ముగియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopalkrishna Gandhi  opposition  vice president  congress  former governor  politics  

Other Articles