Chocolates with drugs seized in telangana మాయదారి చాకెట్లు తిన్నారో.. మత్తుకు బానిసలే..!

Chocolates laced with ganja seized in nizamabad

drugs in chocolates, ganga in chocolates, bang in chocolates, school children chocolates, Madhu Munakka, rich kids school, hifi schools, international schools, prohibition and excise officials, padmavathi novelties, lalitha mahal theatre, nizamabad, telangana, latest news, crime news

Telangana Excise officials seized 28 boxes containing 8,324 chocolates from Padmavathi Novelties, opposite Lalitha Mahal theatre on Gurbabadi Road. The chocolates were imported from Gujarat.

మాయదారి చాకెట్లు తిన్నారో.. మత్తుకు బానిసలే..!

Posted: 07/06/2017 07:10 AM IST
Chocolates laced with ganja seized in nizamabad

తెలంగాణ‌లో డ్ర‌గ్స్ మాఫియా క‌ల‌క‌లం రేపుతోంది. హైద‌రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తన పలు వర్గాలవారిని టార్గెట్ చేసిన మాఫియా.. చివరకు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇంజనీరింగ్, మెడిసస్ కాలేజీ విద్యార్థులను టార్గెట్ చేసింది. అక్కడితో కూడా అగని మాఫియా జడలు విప్పి కళారా నృత్యం చేసేందుకు సంపన్నల పిల్లలు చదువుతున్న పాఠశాలలను కూడా లక్ష్యంగా చేసుకుని కలకలం రేపింది. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతో మొత్తం వ్యవహరం వెలుగుచూసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే మరో రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ అయిన ఎక్సైజ్ శాఖ అనుమానాస్పందంగా కలిగిన అన్ని వస్తువులపై తనిఖీలు చేస్తున్నారు. గుజరాత్, రాజస్థాన్ లకు చెందిన కంపెనీల తయారు చేసిన చాకెట్లుగా ముద్రవేసుకు.. ఐఎస్ఓ మార్కుతో మార్కెట్లోకి విడుదలయిన చాకెట్లలో మత్తు పదార్థాలు వున్నాయన్న పక్క సమాచారంతో అధికారలు దాడులు నిర్వహించారు. మదు మునక్క అన్న పేరుతో వస్తున్న మాయదారి చాకెట్లలో తింటే మత్తుకు బానిసలవుతారని తెలుసుకున్న అధికారులు దాడులు జరిపారు.

నిజామాబాద్ పట్టణంలోనూ లలితామహల్ సెంటర్ వద్ద వున్న పద్మావతి నావెల్టీస్ దుకాణంలో ఈ చాకెట్లు అమ్ముడవుతున్నాయన్న సమాచారంతో దుకాణం యజమానిని అరెస్టు చేశారు. గంజాయి, భంగ్ లతో తయారు చేసిన మధుమునక్కా చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పేరు శారద శరత్ కుమార్ అని పోలీసులు తెలిపారు. చాక్లెట్ల రూపంలో డ్ర‌గ్స్ స‌ర‌ఫరా చేస్తున్నాడ‌ని స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్లి అతనిని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు. డ్ర‌గ్స్  స్మ‌గ్లింగ్ విష‌యంలో మ‌రెంత మంది హ‌స్తం ఉంద‌నే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

టీనేజ్ పిల్ల‌ల‌ని అటువైపుగా ఆక‌ర్షించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుని తెలంగాణ‌లోని స్కూళ్లు, కాలేజీల్లో డ్ర‌గ్స్ ముఠా రెచ్చిపోతోంది. హైద‌రాబాద్ లో మొత్తం 1000 మందికిపైగా పిల్ల‌లు డ్ర‌గ్స్ కు అల‌వాటు ప‌డ్డార‌ని పోలీసులు అంటున్నారు. టీనేజ్ పిల్ల‌ల‌నే లక్ష్యంగా చేసుకుని వారితో డ్ర‌గ్స్ ముఠాలోని స‌భ్యులు ప‌రిచ‌యాలు పెంచుకుని, మంచి కిక్ ఇస్తోంద‌ని న‌మ్మిస్తూ డ్ర‌గ్స్ ను అల‌వాటు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా కూడా పిల్ల‌ల‌కు డ్ర‌గ్స్ ముఠా వ‌ల వేస్తోందని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drugs  chocolates  Madhu Munakka  ganga  bhang  school students  nizamabad  telangana  crime  

Other Articles