mudragada deadline to ap government in fullfilling election promises చలో అమరావతితో కాపుల సత్తా చాటుతాం: ముద్రగడ

Mudragada calls chalo amaravathi for kapus election demands

mudragada hunger strike, mudragada padmanabham, ap government, chalo amaravathi, kapu leader, politics, hunger strike in hospital, hunger strike, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, emergency, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada

Kapu caste leader Mudragada padmanbham gives deadline to chandrababu government in fullfilling given election promises to their kapu caste.

చలో అమరావతితో కాపుల సత్తా చాటుతాం: ముద్రగడ

Posted: 07/06/2017 07:55 AM IST
Mudragada calls chalo amaravathi for kapus election demands

కాపుల రిజర్వేషన్లపై చావో రేవో.. అంటూ చలో అమరావతి పాదయాత్రకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాడు. తమ కమిటీ కేవలం కాపుల రిజర్వేషన్ల కోసమే పర్యటన చేయటం లేదని, బీసీలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని జస్టిస్ మంజునాథ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే కమిటీతో ఇలాంటి స్టేట్ మెంట్లు ఇప్పిస్తుందని ఆయన ఆరోపించాడు.

మంజునాథ కమిషన్ ముమ్మాటికీ కాపుల కోసం వేసిన కమిషనేనని, బీసీల కోసం వేసిన కమిషన్ అయితే, పదమూడు జిల్లాల్లోని కాపులను ఆహ్వానించటం ఎందుకని ముద్రగడ ప్రశ్నించాడు. తూర్పుగోదావరి జిల్లాకు మంజునాథ వచ్చినప్పుడు తననూ ప్రత్యేకంగా పిలిచారని, ఇప్పుడు బీసీల కోసం వేసిందని ఇప్పుడు మంజునాథ మాట మార్చడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయన్నాడు. తెలంగాణ లో గిరిజనులు, ముస్లింల రిజర్వేషన్లకోసం 9వ షెడ్యూలులో చేరుస్తూ కేంద్రానికి నివేదిక పంపించారని, చిత్తశుద్ది అంటే కేసీఆర్ లా ఉండాలని, చంద్రబాబుకు అది లేదని విమర్శించాడు.

 

కమిటీ వ్యాఖ్యలతో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఎంతో ఆవేదన చెందుతున్నారని చెప్పాడు. ఈ నెల 26 లోగా కాపు రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపాలని, లేకుంటే ‘చలో అమరావతి’నిరవధిక పాదయాత్రతో తమ సత్తా చూపిస్తామని ఆయన హెచ్చరించారు. తమ పాదయాత్రను అడ్డుకుంటామని అంటూనే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం బెదిరింపులకు దిగటం సరికాదన్నాడు. చట్టాలు అందరికీ వర్తిస్తాయన్న ఆయన ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉండాలని సూచించాడు. కాపు ఉద్యమం ప్రారంభించి ఈ నెల 26 నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. అందుకే పాదయాత్రకు ముద్రగడ సిద్ధమైపోతున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padmanabham  chandrababu  ap government  chalo amaravathi  kapu leader  politics  

Other Articles