No Sexual Assault on Beautician Sirisha Confirmed

Forensic report out in beautician sirisha case

Beautician Sirisha, Forensic Report, Sirisha Rape Forensic Report, Prabhakar Reddy Sirisha Video, Sirisha Death Video, Sirisha Suicide Video, Kukunurpally CC Cameras, Kukunurpally SI Death, Sirisha Case

Andhra Pradesh Forensic Science Laboratory reveals no sexual assault on 'Sirisha'. City police sources said the vaginal swab and clothes collected from the victim didn't yield any evidence of sexual assault. Why Kukunurpally sub-inspector P. Prabhakar Reddy died.

ఫోరెనిక్స్ రిపోర్ట్: శిరీష రేప్ జరగలేదు!

Posted: 06/29/2017 09:33 AM IST
Forensic report out in beautician sirisha case

సస్పెన్స్ థ్రిల్లర్ కు ఏ మాత్ర తీసిపోకుండా శిరీష సూసైడ్ కేసు కొనసాగుతూ వస్తోంది. లోకేషన్ రీకనస్ట్రక్షన్ పేరిట నిందితులను మొన్న రాత్రంతా తిప్పి నిన్న కోర్టుకు అప్పగించేసిన పోలీసులు మీడియాను డైవర్ట్ చేసేందుకు అలా చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే టైంలో నేరం జరిగిన ప్రదేశంగా భావిస్తున్న కుకునూరుపల్లి స్టేషన్ క్వార్టర్స్ లోకి వెళ్లకుండా వచ్చేయటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తాము లోపలికి వెళ్లేందుకు యత్నించగా స్థానిక పోలీసులు అడ్డుకున్నారని, ఆ సమయంలో తాము వాగ్వాదానికి దిగితే గొడవలు తలెత్తి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందన్న ఉద్దేశ్యంతో తాము సైలెంట్ గా వచ్చేశామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ కేసులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పుటేజ్ లభ్యం కాలేదు. అంతే కాకుండా శిరీష కుటుంబ సభ్యుల ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా లభ్యం కాలేదు. అనుమానాలు నివృత్తికి తమ వద్దకు రావాలంటూ పోలీసులు పరోక్ష వార్నింగ్ ఇవ్వటంతో తర్వాత వాళ్లు సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో శిరీషది హత్యా? లేక ఆత్మహత్యా? అన్నది తేల్చేందుకు ఫోరెన్సిక్ రిపోర్టు పై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అది రానే వచ్చేసింది.

శిరీషపై లైంగిక దాడి జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాధమిక రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రాధమిక రిపోర్టులో స్పెర్మొటోజ కనిపించలేదని నిపుణులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆమె పింక్ కలర్ ఇన్నర్ వేర్ పై మరకలు ఉండటంతో అత్యాచారం అనుమానాలు వ్యక్తం అవ్వటం తెలిసిందే. ఇక ఇప్పుడు నివేదికతో కేసు కొత్త మలుపు తిరుగినట్లయ్యింది. శిరీషపై ఆత్యాచారం జరగని పక్షంలో ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది ఇరు పక్షాల ముందు అనుమానం రేపుతున్న సమాధానం. అయితే ఫోరెన్సిక్ ప్రాధమిక రిపోర్టుకి, ఫైనల్ రిపోర్టుకి తేడాలు కూడా ఉంటాయన్న నిపుణుల వివరణతో కేసు విచారణ మరింత ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sirisha Case  Forensic Report  Sexual Assault  

Other Articles