Chinese Woman faints in horror after breaking bracelet

Tourist faints after breaking pricey jade bracelet

Chinese Woman Faints, Window Shopping, Indian Girl Window Shopping, Chinese Woman Window Shopping, Shopper Faint,Chinese Woman Faint, Girls Window Shopping, China Shopper Shock

Chinese shopper accidentally breaks US$44110 jade bracelet, faints from shock. Later Family members pay some sum released her.

షాపింగ్ కు వెళ్లి మరీ షాక్ తింది

Posted: 06/29/2017 09:01 AM IST
Tourist faints after breaking pricey jade bracelet

కొంత మంది యూత్ లో ఓ సరదా అలవాటు తయారవుతోంది. ఏం కొనకుండా ఊరికే అలా మొత్తం మాల్స్ చుట్టేయటం, ఓ ట్రయల్ వేయటం, మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాటిపై విశ్లేషణలు చేయటం, ఆపై నచ్చలేదంటూ పక్కన పడేసి రావటం దీనిని విండో షాపింగ్ అంటారు. ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పడు బాగా పాకిపోతుంది. అయితే సరిగ్గా ఇలాంటి పనినే చేయాలనుకున్న ఓ అమ్మాయికి ఎలాంటి అనుభవం ఎదురైందో ఇక్కడ చూడండి.

చైనాకు చెందిన సోఫీ అనే మహిళ యున్నన్ ప్రావిన్స్ లోని రూయిలి నగరంలో ఓ జ్యువెల్లరీ షాప్ కి ఇలాగే వెళ్లింది. అక్కడ ఓ పచ్చ కలర్ బ్రాస్ లెట్ ను ముచ్చటపడి చేతులోకి తీసుకుంది. చైనీయులు జేడ్(పచ్చ)ను ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. అయితే తొందరలో అది ఆమె చేతిలోంచి జారి కిందపడింది. అంతే... రంగురాయి కావడంతో అది రెండు ముక్కలైంది. మెల్లిగా అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని యత్నించగా, యజమాని వచ్చి పట్టేసుకున్నాడు.

బ్రాస్ లెట్ ధర 300,00 యువాన్లు (దాదాపు రూ.28 లక్షలు) అని చెప్పటంతో అప్పటికే భయంతో వణికిపోతున్న యువతి షాక్ తో స్పృహ తప్పి పడిపోయింది. షాపులో పనిచేసే వాళ్లు వచ్చి ఆమెకు సపర్యలు చేసినా కొన్ని గంటలపాటు ఆమె కోలుకోలేదు. ఇంతలో విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు షాపు యజమానికి 70,000 యువాన్లు (రూ.6లక్షలు) తెచ్చి ఇచ్చారు. కానీ, పూర్తి డబ్బు చెల్లించాల్సిందేనని ఓనర్ పట్టుబట్టాడు.

China Woman Shopper Faint after Break Bracelet

ఇండిపెండెంట్‌ ఎక్స్‌ పర్ట్‌ ని పిలిపించి బ్రేస్‌ లెట్‌ అసలు ధరను గణించగా, దాని విలువ 180,000 (రూ.17 లక్షలు) ఉంటుందని నిర్ణయించడంతో మిగతా మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తామని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తానికి సరదా ఆ యువతికి భయానక అనుభవాన్ని మిగిల్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinese Woman  Window Shopping  Bracelet Break  

Other Articles