Peacock goes rogue in royal oaks liquor store నాట్యం కోసం నెమలి కూడా మద్యం తాగుతుందా..?

Caught on tape peacock goes on alcohol rage inside liquor store

Peacock rampage inside liquor store, Peacock Trashes Liquor Store, Los Angeles, liquor store, arcadia, royal oaks liquor store, california, peacock, video viral

The peacock flapped around the store trying to find a way out knocking over hundreds of dollars of liquor in the process.

ITEMVIDEOS: నాట్యం కోసం నెమలి కూడా మద్యం తాగుతుందా..?

Posted: 06/07/2017 02:34 PM IST
Caught on tape peacock goes on alcohol rage inside liquor store

నాట్యం చేయడం కోసం నెమలి కూడా మద్యం తాగుతుందా..? ఈ ప్రశ్న ఇప్పుడు ఈ వీడియో చూసిన వారి మదిని తొలుస్తుంది. ఎందుకంటారా..? ఏకంగా వైన్ స్టోర్ లోకి వెళ్లిన ఈ నెమ‌లి మద్యం తాగేదాక బయటకు వెళ్లనన్నట్లు షాపులోనే కూర్చోని ఏకంగా వేల ఖరీదు చేసే మద్యం బాటిళ్లను పగులగొట్టింది. ఇక దానిని పట్టుకునేందుకు వచ్చిన జూ అధికారులను కూడా చాలా శ్రమపెట్టింది. ఈ నెమలి వైన్ స్టోర్ లో చేసిన హ‌ల్ చ‌ల్ ఇప్పుడు నెల్ లో వైరల్ గా మారింది.

అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ పరిధిలోని అర్కేడియాలో గల రాయల్ ఓక్స్ లిక్కర్ స్టోర్ లోకి ఉదయాన్నే నెమలి వచ్చింది. ఇలా ఉదయాన్నే అనుకోని అథిధి రావడంతో బిత్తరపోయిన వైన్ స్టోర్ యజమాని.. వెంటనే జూ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే స్టోర్ లోపల తిష్టవేసిన నెమలి.. జూ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు దాదాపు రూ.30 వేల ఖరీదైన మద్యం సీసాలను ప‌గుల‌కొట్టేసింది.

ఇక నెమలిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన జూ సిబ్బందిని కూడా చాలా శ్రమింపజేసింది. వారు దానిన పట్టుకునే క్రమంలో మరెన్నో మద్యం సిసాలను కూడా నెమలి కిందపడేసింది. ఎట్టకేలకు జూ అధికారులు  దానిని పట్టుకుని తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న గురించి జూ అధికారులు మాట్లాడుతూ ఆ నెమ‌లి అడ‌వి నుంచి త‌ప్పిపోయి ఆర్కాడియా ప్రాంతంలో ఉన్న రాయల్‌ ఓక్‌ లిక్కర్ దుకాణానికి వెళ్లింద‌ని, అది అక్కడి కస్టమర్లపైకి కూడా దూకుతూ వారు బెదిరిపోయేలా చేసింద‌ని చెప్పారు. ఈ నెమ‌లిని ప‌ట్టుకునేట‌ప్పుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Peacock  Liquor Store  Los Angeles  arcadia  royal oaks liquor store  california  video viral  

Other Articles