beggar kamaraju donates 1.2 lakh for temple అది బిక్షువు దయ లేకున్నా.. భిక్షువు దయతలిచాడు..

Kamaraju the begger gives devotees a shed at temple

begger donates 1.2 lakh, beggar donates temple, shed construction at temple, Beggar, help, temple, vizayanagaram, srikakulam, chipurapalli, donation, umanilakanteshwara temple, srikakulam, kamaraju, temple committee

kama raju, a beggar who deposited a lumpsum amount in bank gives a donation of Rs. 1.2 lakh for construction of shed to the devotees of uma nilakanteshwara swamy temple who are kind to him.

అది బిక్షువు దయలేకున్నా.. భిక్షువు దయతలిచాడు..

Posted: 06/02/2017 01:00 PM IST
Kamaraju the begger gives devotees a shed at temple

ఆది బిక్షువు వాడినేమి అడిగేది, బూడిద్దిచ్చే వాడినేమి కోరేది. ఏమి అడిగేది.. ఏమి కోరేది.. అంటూ కే విశ్వానాథ్ సిరివెన్నల చిత్రంలో పాటను పాడుకుంటూ.. పరమేశ్వరుడ్ని తలచుకుంటూ.. తన దీన స్థితికి కారణమేంటంటూ తలచుకుని ఓ ఆలయం వద్ద బిక్షువుగా స్థిరపడి జీవనం సాగిస్తున్న ఓ పెద్దాయన.. తనపై భక్తులు చూపుతున్న అదరణతో.. అ దైవ దర్శనానికి వచ్చే భక్తులకు కూడా తాను ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని భావించాడు. అందకనే ఏకంగా లక్షా 20 వేల రూపాయలతో భక్తుల కోసం షెడ్డు వేసే కార్యక్రమానికి తానే విరాళం ఇచ్చాడు. తనపై దయతలిచిన భక్తులకు తన వంతు సాయం చేశాడు.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఒప్పంగికి చెందిన చేబోలు కామరాజుకు పెళ్లైన కొన్నేళ్లకే సతీవియోగం చెందింది. ఆయనను మిగిలిన కుటుంబసభ్యులు అదరణ లభించలేదు. దీంతో ఒంటరిగా మారిని కామారాజు వున్న ఊరువాడను వదిలేసి విజయనగరంజిల్లా చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయానికి చేరుకుని అక్కడే యాచిస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆలయం ఎదుటే చిన్న గూడారాన్ని వేసుకుని అందులోనే నివాసముంటున్నాడు. ఇక అలయానికి వచ్చే భక్తులు పెద్దాయనను చూసి ఒక్కటో, రెండో రూపాయలు వేయడంతో దాంతోనే అతని జీవనం సాగేది.

ఇలా వచ్చిన సోమ్మను తన జీవనం సాగించగా మిగిలింది బ్యాంకులో దాచుకుంటున్నాడు. అయితే అలయానికి వచ్చే భక్తులపై ఎండల తీవ్రత అధికంగా వుందని భావించిన ఆలయ కమిటీ దేవాలయం ఆవరణలో షెల్టర్లు, షెడ్లు నిర్మించాలని నిర్ణయించింది. కమిటీ నిర్ణయం తెలుసుకున్న కామరాజు వాటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.1.2 లక్షలు తాను విరాళంగా ఇస్తానని ముందుకు వచ్చాడు. ఇప్పటికే బ్యాంకు నుంచి రూ. 60 వేలు తీసుకొచ్చి కమిటీ పెద్దలకు ఇచ్చాడు. మరో రెండు రోజుల్లో మొత్తం సొమ్ము సమకూరుస్తానని చెప్పాడు. షెల్టర్లు పూర్తయ్యాక రూ.10 వేల ఖర్చుతో భక్తులకు అన్నదానం కూడా చేస్తానని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles