Madras HC stays rules on cattle trade కేంద్రానికి షాక్.. పశువధపై నాలుగువారాల స్టే..

Madras high court stays centre s ban on cattle slaughter

Madras High Court stays cattle slaughter, madurai bench of madras HC stays cattle slaughter, Cattle ban notification, cattle politics, Cow politics, madras high court, S Selvagomathy

The Madurai bench of the Madras High Court stayed - for a period of four weeks - the Centre's Gazette notification banning the sale and purchase of cattle for the purpose of slaughter.

కేంద్రానికి షాక్.. పశువధపై నాలుగువారాల స్టే..

Posted: 05/30/2017 06:07 PM IST
Madras high court stays centre s ban on cattle slaughter

కేంద్ర ప్రభుత్వం గోవ‌ధ‌కు వ్యతిరేకంగా తీసుకువచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ను మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఇవాళ నాలుగు వారాల స్టే విధించింది. పశువధను అరిక‌ట్టేలా దేశ వ్యాప్తంగా ఓ చ‌ట్టం తీసుకురావాల‌ని పెద్ద ఎత్తున వ‌స్తున్న డిమాండ్ నేప‌థ్యంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా పలువురు అందోళన చేపట్టారు. పశువధ జాబితా నుంచి గేదలను తొలగించాలని డిమాండ్ ముఖ్యంగా తెరమీదకు వచ్చింది. ఇక ఈ నిర్ణయంపై పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి.

కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ నుంచి తీవ్ర వ్యతిరేక‌త వ‌స్తోంది. దీంతో ప్రజాందోళన నేపథ్యంలో ఎస్. సెల్వగోమతి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా పశువధపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. దీనిపై నాలుగు వారాల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అదేశించింది. ఒక మతం లేదా వర్గం ఆచారాల ప్రకారం జంతువులను చంపడం నేరం కాదని ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ (పీసీఏ) చట్టంలోని సెక్షన్ 28 చెబుతోందని సెల్వగోమతి తన ప్రజాహిత వ్యాజ్యంలో పేర్కొన్నారు.

అయితే, కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ పై స్టే విధించిన న్యాయస్థానం.. తదుపరి విచారణలోపు తమ ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని అదేశించింది.ఈ నేపథ్యంలో అకస్మికంగా కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేయడం, అందులో పలు అంక్షలను విధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా ప్రశ్నించింది. ఈ పిటీషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాల తరువాత చేపట్టనున్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles