phishing hack warning after bogus Google Docs link తస్మాత్ జాగ్రత్త: పది లక్షల మంది అకౌంట్లు హ్యాక్..

Google docs phishing attack has already affected 1 million accounts

google accounts hacked, gmail accounts hacked, gmail phishing hack, gmail phishing scam, google docs attachment, Gmail, gmail scam, google docs, phishing scam, 1 million accounts, gmail account, accounts hacked

A "phishing" scam that tricked people with what appeared to be Google Docs links was doused by the internet giant after spreading wildly.

తస్మాత్ జాగ్రత్త: పది లక్షల మంది అకౌంట్లు హ్యాక్..

Posted: 05/06/2017 12:14 PM IST
Google docs phishing attack has already affected 1 million accounts

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల అకౌంట్లును హ్యాకర్లు హ్యాక్ చేశారు. దీంతో మీ సమస్త సమాచారం వారి కబంధ హస్తాలలోకి చేరుకుంది. వెంటనే హ్యాకర్ల నుంచి మీ అకౌంట్లను పధిలపర్చుకోండి అంటూ గూగుల్ అనుబంధ జీమెయిల్‌ తమ కస్టమర్లకు సూచిస్తుంది. హ్యాకర్ల బారిన మీరూ పడ్డారా..? ఓసారి సరిచూసుకోండి. మీరు కూడా జీమెయిల్ వాడుతున్నారా? అయితే తక్షణం హ్యకర్ల బారి నుంచి తప్పించుకోండి. మీ అకౌంటులోని సెక్యూరిటీ ఫీచర్లకు వెళ్లి అక్కడున్న యాప్స్ లో గూగుల్ డాక్స్ యాఫ్ ను డిలీట్ చేస్తే హ్యాకర్ల బారి నుంచి తప్పించుకున్నవారు అవుతారు.

ఇక అక్కడ గూగుల్ డాక్స్ యాప్ లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ పథిలంగానే వుంది. కాగా భవిష్యత్తులో మీ జీమెయిల్ అకౌంటు హ్యాకింగ్ కు గురికాకుండా వుండాలంటే కొన్న సూచనలు పాటించాలి. మీ జీమెయిల్ అకౌంటుకు ఎవరి నుంచైనా గూగుల్‌ డాక్‌ ఫైళ్లను మీకు షేర్‌ చేసినట్లు ఈమెయిల్‌ వచ్చిందా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మెయిల్‌ తెరవకండి. వెంటనే ఇన్‌బాక్స్‌ నుంచి ఆ మెయిళ్లను డిలీట్‌ చేయడం మేలు. ఈ తరహా మెసేజ్ లతో హ్యాకర్లు కొత్తరకం దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గూగుల్ జీమెయిల్ కూడా ధృవీకరించింది.

ముఖ్యమైన ఫైళ్లు పంపినట్లుగా జీమెయిల్‌ ఖాతాదారులను నమ్మిస్తూ వారి ఖాతాలను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని నిపుణులు గుర్తించారు. మీ అకౌంట్ కు ఫలానా వ్యక్తి ఈ ఫైల్ షేర్‌ చేశాడు.. దీనిని గూగుల్‌ డాక్స్ లోనే తెరవాలని సూచించి వుండటంతో.. దానిని క్లిక్ చేయగానే యాక్సెప్ట్ చేయండీ అన్న బటన్ వస్తుంది. దానిని క్లిక్ చేయగానే మన గూగుల్ ఖాతాను పూర్తిగా హ్యాకర్ల అధీనంలోకి వెళ్తుంది. అంతేకాదు.. మీ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్నవారందరికీ కూడా మీ పేరుతోనే ఆ ప్రమాదకర ఈమెయిల్‌ వెళ్తుందట. దాంతో ఇతరులు కూడా హ్యాకర్ల దాడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఫ్రెండ్స్ బీ కేర్ ఫుల్..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gmail  gmail scam  google docs  phishing scam  1 million accounts  gmail account  accounts hacked  

Other Articles