నకిలీ డాక్డర్ అవతారమెత్తిన హెడ్ నర్సు.. వాత పెట్టిన కోర్టు..! Now, Nurses turn doctor, Life in risk

Now nurses turn doctor life in risk

Now, Nurses turn doctor, Life in risk, fake doctors fined, head nurse pretended as doctor, swaroopa rani fake doctor, fake doctor wrong diagnosis, fake doctor fined, Rs2.4 lakh compensation, causing patient to death, Head nurse, swarupa clinic, hyderabad consumer forum, fake doctor, Rs2.4 lakh, compensation, patient, death

With her experiance of Head nurse, a lady opened a clinic and pretended like doctor has been asked to pay Rs2.4 lakh compensation by Hyderabad Consumer Forum for wrongly diagnosing a patient and causing his death

నకిలీ డాక్డర్ అవతారమెత్తిన హెడ్ నర్సు.. వాత పెట్టిన కోర్టు..!

Posted: 04/26/2017 06:56 PM IST
Now nurses turn doctor life in risk

ధనార్జన కోసం వక్రమార్గం పట్టింది ఓ హెడ్ నర్సు. డాక్టరు చెప్పింది చెప్పినట్లుగా చేయడంతో పాటు కేవలం ఇంజక్షన్లు ఇవ్వడం, లేదా సెలైన్ పెట్టడం వరకు మాత్రమే అమెకు తెలిసినా.. హెడ్ నర్సు అనుభవంతో తనను గుర్తెరుగని చోట ఏకంగా చిన్నపాటి క్లినిక్ పెట్టేసి డాక్టర్ గా బడాయిలు పోతూ.. ఏకంగా పెద్ద మొత్తంలో డబ్బును అర్జించడమే పనిగా పెట్టుకుంది. అదే అనుభవంతో చికిత్స చేస్తూ ఏకంగా నిండు ప్రాణాన్ని బలిగొనింది. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించిరన బాధితుడికి కోర్టు న్యాయాన్ని అందించి.. సదరు నకిలీ డాక్టర్ కు రెండున్నర లక్షల రూపాయల మేర జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా వుండే కె. అంబన్న తన కుమారుడుకి జ్వరం, తలనొప్పితో బాధపడుతుండటంతో అందుబాటులో వున్న స్వరూప క్లినిక్ తీసుకెళ్లాడు. అక్కడ అమె చికిత్స పేరుతో ఓ ఇంజక్షన్ ఇచ్చేసి సెలైన్ కూడా పెట్టింది. దీంతో కొద్దిసేపటికి బాధిత బాటులు ఏకంగా కుడి వైపు పక్షవాతం ఏర్పడింది. దీనిపై డాక్టరును బాలుడి తల్లిదండ్రులు నిలదీయగా, అఘమేఘాల మీద బాలుడ్ని వేరే అస్పత్రికి తరలించేందుకు ఏర్పాటు చేసింది. అయితే అమె రిఫర్ చేసిన ఏ అస్పత్రి బాలుడ్ని చేర్చుకోలేదు, బాలుడు పరిస్థితి చాలా సీరియస్ గా వుందని అక్కడి వైద్యులు చెప్పారు.

ఇక తన బిడ్డను తికించుకోవాలన్న ఆశతో ఆ తండ్రి బాలుడ్ని ఉస్మానియా అస్పత్రికి తరలించాడు. అయితే అక్కడికి చేరుకునే లోపే ఆ బాలుడు మరణించాడని వైద్యులు చెప్పారు. బాలుడికి తప్పుడు చికిత్సను చేయడం వల్లే మరణించాడని అక్కడి వైద్యులు పేర్నోన్నారు. దీంతో బాబు అంత్యక్రియల తరువాత స్వరూప రాణి క్లినిక్ పై అంబన్న ఏకంగా కన్జూమర్ కోర్టును అశ్రయించాడు. అమె గురించి విచారించగా అమె అసలు వైద్యురాలు కాదని, కేవలం హెడ్ నర్సు అనుభవంతో వైద్యం చేస్తుందని తెలిసిందని న్యాయస్థానానికి వివరించాడు.

దీంతో వైద్యురాలి ముసుగులో నిండు ప్రాణాన్ని బలితీసుకున్న స్వరూప రాణికి ఏకంగా రెండు లక్షల 40వేల రూపాయలను చెల్లించాలని, ఇక న్యాయస్థానం ఖర్చుల కోసం మరో ఐదు వేల రూపాయలను మృతుడి కుటుంబానికి జరిమానాగా చెల్లించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో పాటు ఇకపై అస్పత్రిని నడపరాదని కూడా న్యాయస్థానం స్వరూపరాణిని అదేశించింది. అయితే బాధితుడు వినియోగదారుడు కాదని అమె తరపున వాదించిన న్యాయవాది వాదనలు న్యాయస్థానం తోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Head nurse  swarupa clinic  hyderabad consumer forum  fake doctor  Rs2.4 lakh  compensation  patient  death  

Other Articles