Man celebrates divorce by distributing sweets విడాకులు మంజూరయ్యాయని స్వీట్లు పంచిన గుజరాతీ యువకుడు..

Man celebrates divorce by distributing 50 kg kaju barfi in gujarat

Rinkesh Rachchh celebrates divorce, gujarat man celebrates divorce, Rinkesh Rachchh surprising reaction after divorce, rinkesh celebrates divorce distributing kaju burfi, Rinkesh Rachchh, rajkot, divorce, divorce celebrations, distributes sweets, gujarat, viral news, trending

Rinkesh Rachchh a man from Rajkot, Gujarat had a totally surprising reaction to the end of his marriage as he went on to distribute 50 kgs of kaju barfi.

విడాకులను సెలబ్రేట్ చేసుకున్న గుజరాతీ యువకుడు..

Posted: 04/26/2017 07:43 PM IST
Man celebrates divorce by distributing 50 kg kaju barfi in gujarat

పెళ్లంటే నూరేళ్ల పంట.. రెండు జీవితాల మద్య పెనవేసుకున్న అత్మీయ అనురాగ బంధం.. మూడు ముళ్ల బంధంతో ఏకమయ్యే జంట.. మూడు తరాలకు పునాదులుగా నిలవాలని బావిస్తుంటారు పెద్దలు మనవలు, మనవరాళ్లుతో సుఖసంతోషంగా వుండాలని దాని అర్థమంటారు. అయితే ఈ బంధం కొనాసాగింపులో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా.. వాటిని ఒకరికొకరు అండగా నిలుస్తూ పరిష్కారించుకుంటూ ముందుకు సాగుతారు.

తమ అనుభవాలను తమవారితో చివరి దశలో పంచుకుంటూ హాయిగా తమ సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. చివరకు ఈ 50 వసంతాల ప్రయాణంలో ఎవరినెవరు కోల్పోయినా.. అక్కడి నుంచే మరోకరి అంపశయ్యపైకి చేరుకుంటారు. ఇది భారతీయ వివాహానికి వున్న బలం.. అ బలాన్ని నడిపిస్తున్న బంధం. ఈ బంధంతో రెండు జీవితాలు ఒక్కటే క్రమంలో ఇరు కటుంబాలు ఒక పండుగలా జరుపుకుంటాయి. తమ తాహత్తుకు సరిపోయే విధంగా అంగరంగ వైభవంగా వేడుకను జరిస్తారు. అయితే గుజరాత్ లోని ఈ యువకుడు మాత్రం కొంచెం భిన్నం.

ఎవరైనా అనుకోని పరిస్థితుల మధ్య తమ జీవిత భాగస్వామితో విడిపోవాల్సి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లో దానిని విషాదంగానే భావిస్తారు. కానీ గుజారాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రింకేష్ రచచ్చ అనే యువకుడు మాత్రం తన విడాకులు రావడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. న్యాయస్థానం తనకు విడాకులను మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏకంగా అత్యంత ఖరీదైన కాజు బర్ఫీ స్వీట్లను పంచి మరీ తన వివాహం నుంచి విముక్తి పోందిన అనందాన్ని పంచుకున్నాడు.

తనకు వివాహమైన ఏడాదికి తన జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేధాలు అత్యంత ఘోరంగా వున్నాయని, నరకాన్ని చవిచూశానని రింకేష్ తెలిపాడు. కాగా, రెండేళ్ల న్యాయపోరాటం తరువాత తనకు విడాకులు మంజూరు కావడం పట్లు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లను పంచుతున్నానని చెప్పాడు. అయితే తనకు విడాకులు మంజూరు కావడం పట్లు అనేక మంది శుభాకాంక్షలు తెలిపారని వారిలో చాలా మంది తనకు ఎలా విడాకులు వచ్చాయన్న విషయమై అడిగారని అన్నారు. అయితే వారిలో చాలా మంది అత్తలే వున్నారని.. వారి కోడళ్లతో నరకం చూస్తున్నామని వారు తనకు చెప్పారని రింకేష్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rinkesh Rachchh  rajkot  divorce  divorce celebrations  distributes sweets  gujarat  viral news  trending  

Other Articles