girl spend all night in bathroom to escape rape attempt అత్యాచారం తప్పించుకున్న యువతి రాత్రంతా అలా..

Teen girl spend all night in bathroom to escape rape attempt

teen girl spent all night in bathroom, girl escaped from molester, girl rescued herself from molester, girl locked herself in bathroom to escape from molester, neighbour boy attempted rape on teen girl, teen girl molestation, teen girl sexual assault, LN nagar, Yousufguda, Hyderabad police, crime

A 18 years girl from LN nagar of yousufguda spend all night in bathroom to escape herself from molester who entered into her house knowing that her parents went to native place.

అత్యాచారం తప్పించుకున్న యువతి రాత్రంతా అలా..

Posted: 04/26/2017 12:52 PM IST
Teen girl spend all night in bathroom to escape rape attempt

తెలసినవాడే.. ఇంట్లో ఒంటరిగా వుంటున్న అమ్మాయికి అండగా వుండాల్సిన వాడు.. ఏకంగా కంచె చెను మేసిన చందంగా అమ్మాయిపై అఘాయిత్యానికి యత్నించాడు. తనను కబళించేందుకు వచ్చిన మగమృగాన్ని చూసి భయాందోళనకు గురైన యువతి.. ఆ పైశాచిక మృగం నుంచి తనను తాను కాపాడుకునేందకు.. రాత్రంతా బాత్రమ్ లో దాక్కుంది. అతడు వెళ్లిపోయాడని తెలిసినా.. ఏ క్షణంలోనైనా తిరిగి రావచ్చన్న భయంతో.. బిక్కబిక్కుమంటూ గడిపింది. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని యూసూప్ గూడ ఎల్ఎన్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... హైదరాబాదు యూసుఫ్‌ గూడలోని ఎల్‌ఎన్‌ నగర్‌ లో తన తల్లిదండ్రులతో పాటుగా ఓ యువతి నివాసం వుంటుంది. అర్జెంటు పనిపై అమె తల్లిదండ్రులు ఊరికి వెళ్లాల్సివచ్చింది. అయితే ఆ యువతి పరీక్షల కోసం సిద్దం అవుతున్న కారణంగా అమెను గత్యంతర లేని పరిస్థితుల్లో ఒంటరిగా వదిలి వెళ్లారు. అయితే వెళ్తూ వెళ్తూ పోరుగింటి వారికి తమ కూతురు ఒంటరిగా వుంటుందని, కొంచెం చూస్తువుండమని చెప్పి మరీ వెళ్లారు. ఈ మాటలను పోరుగింట్లో అద్దెకు నివాసముంటున్న యువకుడి చెవిన పడ్డాయి.

నగరంలోని ఒక టీవీ ఛానల్ లో పని చేసే రత్న కుమార్‌ (30) అనే యువకుడు అర్ధ రాత్రి సమయంలో వారి ఇంట్లో చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. అతని నుంచి తప్పించుకున్న యువతి ఇంట్లోని బాత్రూమ్ లో దూరి లోపల గడియ పెట్టుకుంది. గది తలుపు తెరిచే ప్రయత్నం చేస్తే...అరుస్తానని బెదిరించింది. దీంతో అతను వెనుదిరిగాడు. అయినప్పటికీ రాత్రంతా అందులోనే గడిపింది. అనంతరం బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : teen girl  neighbour  sexual assault  LN nagar  Yousufguda  Hyderabad police  crime  

Other Articles