Sasikala Posters Removed From AIADMK Office మేనల్లుడి అరెస్టుతో.. చిన్నమ్మ క్లీన్ అయ్యిందోచ్..!

Sasikala posters removed from aiadmk headquarters in chennai

sasikala posters removed from AIADMK office, sasikala banners removed from AIADMK office, sasikala flexsi removed from AIADMK office, AIADMK office,Chennai, E Palanisamy, O. Panneerselvam, TTV Dinakaran, VK Sasikala, Tamil Nadu

Banners of VK Sasikala, the chief of Tamil Nadu’s ruling AIADMK, were removed from the party’s main office in Chennai hours after her nephew and deputy TTV Dinakaran was arrested in Delhi

ITEMVIDEOS: మేనల్లుడి అరెస్టుతో.. చిన్నమ్మ క్లీన్ అయ్యిందోచ్..!

Posted: 04/26/2017 01:53 PM IST
Sasikala posters removed from aiadmk headquarters in chennai

అన్నాడీఎంకే పార్టీ నుండి రెండుగా వీడిపోయిన వేర్వేరు వర్గాలు.. మళ్లీ ఒక్కటి కానున్నాయి. ఈ విషయంలో రమారమి కొలిక్కి వచ్చిన చర్చలు చివరి నిమిషంలో రసకందాయంలో పడ్డాయి. అయితే కేంద్రం ఇరు వర్గాలను హెచ్చరించిన నేపథ్యంలో ఇరువర్గాలు మళ్లి విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి. అయితే పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు ముఖ్యప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించాలని పన్నీరు సెల్వం వర్గం షరతు పెట్టింది.

దీంతో ఆ షరుతుపై మీనమేషాలు లెక్కిస్తున్న పళనీస్వామి ప్రభుత్వం.. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు దినకరన్‌ అరెస్టు కావడంతో ఆ చర్యలకు పూనుకుంది. దినకరన్ అరెస్టైన కొద్ది గంటల్లోనే పార్టీలో కార్యకర్తలు శశికళ వున్న పోస్టర్లను, బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించారు. చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో స్వయంగా పార్టీ కార్యకర్తలే చిన్నమ్మ శశికళ ఫ్లెక్సీలను తొలగించారు దీంతో వీలినానికి మార్గం సుగమం అయినట్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

దీంతో తమిళనాడులోని అధికార పార్టీలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పార్టీ నుంచి దూరంగా జరిగినట్లైంది. అంతేకాకుండా శశికళ కుటుంబం నుంచి కూడా ఎవరూ పార్టీలో లేనట్లైంది. ఇక వారు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం లేకపోవడంతో.. ఇక ఇరువర్గాల వీలీనం త్వరలోనే పట్టానెక్కనుందని సమాచారం. ఈ పరిణామాలపై పన్నీర్‌ వర్గం మీడియా ప్రతినిధి స్వామినాథన్‌ స్పందిస్తూ.. క్లీన్ శశికళ అండ్ కో ద్వారా పార్టీ పవిత్రంగా మారిందని అన్నారు. ఇది తమిళ ప్రజలకు శుభసూచకమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AIADMK  Chennai  E Palanisamy  O. Panneerselvam  TTV Dinakaran  VK Sasikala  Tamil Nadu  

Other Articles