Security Forces Launch all-out attack against Naxals

Security forces ready for sukma encounter revenge

Home Ministry Sukma Attack, Sukma Encounter, All-out Offensive, Venkaiah Naidu Human Rights Activists, All-out Attack, Rajnath Singh All-out, Rajnath Singh Maoists, All-out Comments, Sukma Revenge Attack, Security Forces Maoists , Security Forces Naxals

The Home Ministry has asked security forces on the ground to go on an "all-out offensive" against Maoists and "show results in the next few weeks". Venkaiah Naidu slams human rights activists double standards.

మావోలపై రివెంజ్ కు అంతా రెడీ?

Posted: 04/26/2017 12:59 PM IST
Security forces ready for sukma encounter revenge

26 మంది జవాన్ల ప్రాణాలను బలిగొన్న మావోయిస్టులను సమూలంగా ఏరివేసేందుకు కేంద్రం కీలక ఆదేశాలు వెలువరించింది. అడవుల్లోని మావోలపై దాడులు జరిపి 'ఆలౌట్' చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. వీలైనంత త్వరంగా ఆపరేషన్ పూర్తి చేసి త్వరలోనే ఫలితాలను చూపించాలని హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి, సీఆర్పీఎఫ్ డీజీ సుదీప్ లఖ్టాకియా, సీనియర్ సెక్యూరిటీ అడ్వయిజర్ కే విజయ్ కుమార్ లకు ఆదేశాలు అందాయని భోగట్టా. అందిన లీకేజీల మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియా వరుసగా కథనాలు ప్రచురించటం విశేషం.

నక్సల్స్ పై అనుసరిస్తున్న వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాలని, వచ్చే రెండున్నర నెలల వ్యవధిలో ఒక్క మావో కూడా కనిపించకుండా చూడాలని ఆయన ఆదేశించినట్టు సమాచారం. "మీకేం కావాలో చెప్పండి. మరింత మంది జవాన్లు కావాలా? సాంకేతిక సహకారం కావాలా? ఇంకా ఏమైనా ఆయుధాలు కావాలా? ఏదడిగినా మీముందు ఉంచుతాను. నాకు మాత్రం ఫలితాలు కనిపించాలి" అని ఆయన(రాజ్ నాథ్) గట్టిగా చెప్పినట్టు ఓ ఉన్నత అధికారి వ్యాఖ్యలను సదరు కథనాలు ఉటంకించాయి.

సుక్మా దాడిలో చనిపోయిన వారి పార్థివ దేహాలకు నివాళులర్పించేందుకు రాయపూర్ వెళ్లిన రాజ్ నాథ్, దెబ్బకు దెబ్బ తీసి తీరతామని, ఈ మారణ హోమానికి ప్రతీకారం తీర్చుకుని తీరుతామని ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8వ తేదీన దేశంలోని 10 మావో ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఢిల్లీలో నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నాడు కూడా.

వాళ్లు ఎక్కడికి పోయారు: వెంకయ్యనాయుడు

ఎన్‌కౌంటర్‌లో ఒక్క నక్సల్ చనిపోయినా రాద్ధాంతం చేసే మానవహక్కుల సంఘాల నేతలు, మద్దతుదారులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారంటూ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. మావోయిస్టుల దాడిని దేశమంతా ఖండించాలన్నాలని పిలుపునిచ్చాడు. మావోలను అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విశ్వవిద్యాలయాల్లో కూర్చుని ఖండించే మానవహక్కుల నేతలు 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను మావోలు పొట్టనపెట్టుకున్నా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమన్నాడు.

వారి ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనమని విమర్శించారు. జవాన్లకైనా, మావోలకైనా ఒకే రకమైన హక్కులు ఉంటాయని, వారికేమీ ప్రత్యేక హక్కులు ఉండవన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. నక్సలైట్ల అనాగరిక చర్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు సిద్ధపడుతున్నట్టు వెంకయ్య స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sukuma Revenge  Security Forces  All Out Attack  

Other Articles