ప్రకటనైతే చేశారు.. కానీ.! అమాత్యులవారికి అనుమతి వుందా..? nandyala candidate will be announced on 24th says akhila priya

Nandyala candidate will be announced on 24th says akhila priya

bhuma akhila priya, ap minister, tourism department, nandyala by election, bhuma nagireddy, shobha nagireddy, shilpa mohan reddy, chandrababu naidu, politics

But then, Shilpa Mohan Reddy who contested here in 2014 and lost is seeking the same seat since Bhuma Akhila Priya is already given a cabinet berth.

ప్రకటనైతే చేశారు.. కానీ.! అమాత్యులవారికి అనుమతి వుందా..?

Posted: 04/19/2017 04:35 PM IST
Nandyala candidate will be announced on 24th says akhila priya

భూమా నాగిరెడ్డి అకస్మిక మరణంతో వచ్చిన నంద్యాల ఉప ఎన్నికలు మొత్తానికి అధికార, విపక్షాల మధ్య హైవోల్టేజీతో సాగనున్నాయి. ఎన్నికల విషయమై ఇప్పటి వరకు ఎన్నికల కమీషన్ ఏలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకపోయినా.. అప్పుడే అధికార పార్టీ నుంచి టిక్కెట్ అశించేవారి సంఖ్య పెరుగుతూ పోతుంది. దీంతో ఈ సారి నంద్యాల ఉప ఎన్నికల స్థానంలో రసవత్తర పోరు తధ్యమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు నంద్యాల ఉపఎన్నికల టికెట్ ను అశిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి.. తనకు టికెట్ రాని పక్షంలో విపక్ష పార్టీలో చేరైనా పోటీలో పాల్గొనాలని యోచనలో వున్నారు.

కాగా తమ తండ్రి భూమానాగిరెడ్డి పాతినిధ్యం వహించిన నంద్యాల నియోజకవర్గం నుంచి ఆయన వారసులైన కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో పలు శాఖాపరమై అంశాలపై మాట్లాడారు. వాటితో పాటు నంద్యాల ఉపఎన్నిక విషయమై కూడా ప్రస్తావించారు. నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు.

అయితే ఇలాంటి ప్రకటన చేసే ముందు ఉప ఎన్నిక అభ్యర్థిని ఖారారు చేసే ముందు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు ప్రధానకార్యదర్శి లోకేష్ నుంచి గానీ అనుమతి తీసుకున్నారా..? లేదా..? అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థి తమ కుటుంబవారే అయివుంటారని నేరుగా మీడియా ముఖంగా ప్రకటించిన అఖిలప్రియ.. 24న పేరును కూడా ప్రకటిస్తామని చెప్పడం ఒకింత విస్మయానికి గురిచేయగా, ఇలా అభ్యర్థిని ప్రకటిస్తున్నామన్న విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులకు చెప్పారా..? అన్న సందేభాలు కలుగుతున్నాయి. వారి అనుమతి లేకుండా ప్రకటిస్తే అఖిలప్రియ ప్రకటించిన వారికే వారు టికెట్లు ఇస్తారా..? అన్న సందేహాలు కూడా రేకెత్తుతున్నాయి.

నంద్యాల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. గత ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి భూమానాగిరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయన అకస్మిక మరణంతో అఖిలప్రియకు మంత్రిపదవి ఇచ్చిన దరిమిలా తనకు నంద్యాల టిక్కెట్ ను ఇవ్వాలని కోరుతున్నారు. ఈ అంశమై చర్చించడానికి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ తరుణంలోనే భూమా అఖిలప్రియ ఇలాంటి ప్రకటన చేయడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక మరికోందరు మాత్రం పార్టీ నేతలే అమెతె అక్కడ అలా ప్రకటించాలని చెప్పివుంటారని, వారి సూచనల మేరకే అఖిల అలాంటి ప్రకటన చేసివుంటుందని కూడా అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles