మొట్టుదిగిన యునైటెడ్ ఎయిర్ లైన్స్.. డాక్టరుకు క్షమాపణలు United Airlines CEO apologises for 'horrific event

United airlines ceo apologises for horrific event promises review of policies

Airplane, United airlines, united ceo, Oscar Munoz, doctor, injured passenger, Dr. David Dao, Kentucky, Flying, Flight, Plane, United Airways, Travel, Police, Flight Attendant

United Airlines CEO Oscar Munoz said, "I deeply apologise to the customer forcibly removed and to all the customers aboard. No one should ever be mistreated this way."

మొట్టుదిగిన యునైటెడ్ ఎయిర్ లైన్స్.. డాక్టరుకు క్షమాపణలు

Posted: 04/12/2017 01:04 PM IST
United airlines ceo apologises for horrific event promises review of policies

తాను విమానంలో ప్రయాణించడం అత్యవసరమని దిగేందుకు భీష్మించిన ప్రయాణికుడ్ని దారుణంగా విమానం నుంచి ఈడ్చిపారేసిన ఘటనపై ఎట్టకేలకు విమానసంస్థ యునైటెడ్ ఎయిర్ లైన్స్ మొట్టుదిగింది. బెట్టువీడి గాయాలపాలైన వైద్యుడికి క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనను విమనాంలోని ఓ ప్రయాణికుడు తన మొబైల్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలను మూటగట్టుకున్న తరువాత నింపాదిగా క్షమాపణలు చెప్పింది.

అధికంగా టికెట్లు బుక్‌ చేసుకున్న తరువాత విమానంలో సీట్లు ఖాళీగా లేవన్న కారణంగా 69 ఏళ్ల డేవిడ్‌ డావో అనే ప్రయాణికుడిపై విమాన సిబ్బంది దౌర్జన్యపూరితంగా వ్యవహరించిప ఘటనపై స్పందించిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ సీఈఓ ఆస్కార్‌ మునోజ్‌.. వైద్యుడిని క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇది చాలా బాధకరమైన ఘటన.. వైద్యుడిపై తమ సిబ్బంది చేసిన దౌర్జన్యం అసమర్థనీయం. ఇందుకు తాము తమ విమానయాన సంస్థ తరపున బేషరతుగా క్షమాపణలు చెబుతున్నామని ప్రకటలో పేర్కోంది. ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తామని, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు.

షికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంతో క్షమాపణలు చెప్పం అంటూ బీష్మించుకున్న విమానాయాన సంస్థ ఎట్టకేలకు దిగివచ్చింది. అయితే యునైటెడ్ ఎయిర్ వేస్ సంస్థ దిగిరావడానికి మరో కారణం కూడా లేకపోలేదని అంటున్నారు బాధితుడి కుటుంభసభ్యులు. జరిగిన ఘటనపై చికాగో సిటీ కౌన్సీల్ ఏవియేషన్ కమిటీ ముందుకు వెళ్లిందని, సదరు విమానసంస్థ సీఈఓతో పాటు ఏవియేషన్ శాఖ అదికారులను పిలిచ ఘటనపై విచారించనున్న నేపథ్యంలోనే విమానసంస్థ దిగివచ్చిందంటున్నారు. కాగా తమకు ప్రపంచ వ్యాప్తంగా అండగా నిలిచిన నెట్ జనులకు వారు ధన్యవాదాలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Airplane  United airlines  united ceo  Oscar Munoz  doctor  injured passenger  Dr. David Dao  Kentucky  

Other Articles