ఉత్తమ్ కుమార్ కు ఆ ఒక్కటి మాత్రమే చాత కాదా? | Uttam Kumar Reddy fails to criticize TRS.

Telangana congress leaders no guts to face trs

TPCC Chief Uttam Kumar Reddy, Telangana Congress, Congress TRS, Uttam Kumar Reddy Courage, TRS T Congress, Congress KTR Kavitha, T Congress Leaders Courage

TPCC Chief Uttam Kumar Reddy and team completely lack the courage to fight against the ruling party.

రెడ్డిగారి దళం జస్ట్ మాటల వరకేనా?

Posted: 04/11/2017 04:01 PM IST
Telangana congress leaders no guts to face trs

గులాబీ దళంపై మాటలతో మాత్రమే విరుచుకుపడుతున్న టీ కాంగ్రెస్ నేతలు ఆచరణలో మాత్రం చాలా వీక్ స్టేజీలోనే ఉండిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని టీపీసీసీ టీం లో మీడియా ముందుకు వచ్చి తెగించి ఆరోపణలు చేసే నేతలు ఉన్నప్పటికీ చేతల్లో వాటిని నిరూపించకలేకపోవటమే పెద్ద మైనస్ గా మారిపోతుంది. శనివారం జరిగిన విద్యార్థి విభాగం అయిన ఎన్ ఎస్ యూఐ 46వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా ఇలాంటి సీన్లే ఇక్కడ దర్శనమిచ్చాయి.

ఉత్తమ్ కుమార్ రెడ్డితోసహా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు విక్రమార్క లాంటి వాళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. తమ సమస్యలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విద్యార్థులు నడుం బిగించాలంటూ బాగానే ఉపన్యాసాలు దంచారు. మరీ ముఖ్యంగా తమను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న కేటీఆర్, కవిత పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.అసలు రాజకీయ అనుభవం లేని వాళ్లు తమ లాంటి సీనియర్లను విమర్శించటమేంటని, టోటల్ గా వ్యవస్థను నాశనం చేసేందుకే కేసీఆర్ కుటుంబం చూస్తోందంటూ వ్యక్తిగత ఆరోపణలు చేశారు.

ఇక్కడి దాకా బాగానే ఉన్నప్పటికీ ప్రజలను చైతన్యవంతుల్ని చేయటంలోనూ, ప్రభుత్వాన్ని కీలక సమస్యలపై నిలదీయటంలోనూ చిత్తశుద్ధి, ఫ్లానింగ్ లాంటివి వారిలో ఎంత మాత్రం కనిపించటం లేదన్నది విశ్లేషకుల స్ట్రాంగ్ ఒపీనియన్. ప్రాజెక్టుల దగ్గరి నుంచి కీలకమైన ప్రతీ దాంట్లోనూ వైఫల్యం చెందుతూ రావటమే ఇందుకు నిదర్శనం. కాబోయే సీఎం అంటూ గడ్డాలు పెంచుకోవటం కాదు, ముందు పార్టీని గాడిన పెట్టి, వారిలో ధైర్యం నూరిపోస్తే మంచిదని ఉత్తమ్ కు వారు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T Congress  Uttam Kumar Reddy  TRS  

Other Articles