మహాభారతం గురించి ఇప్పుడెందుకు... | EC Dhritarashtra Blindly Helping Son BJP.

Arvind kejriwal fire on election commission

Arvind Kejriwal, Arvind Kejriwal Election Commission, Dhritarashtra Kejriwal , Kejriwal Mahabharatha, Kejriwal EVM Ban, Kejriwal Delhi Municipal Corporation Elections, Kejriwal Derogatory Comments

Delhi CM Arvind Kejriwal slams Election Commission again. says EC Dhritarashtra Blindly Helping Son BJP's Power.

సామాన్య సీఎం మళ్లీ ఎస్కున్నాడే!

Posted: 04/10/2017 03:00 PM IST
Arvind kejriwal fire on election commission

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తన నోటికి పని చెప్పాడు. ఎలక్ట్రాన్ ఓటింగ్ మెషీన్ ల స్థానే బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలంటూ గళం వినిపిస్తున్న వాళ్లలో గత కొంత కాలంగా ఈయన కూడా ఉన్నాడు. ఏప్రిల్ 28న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు ఉండటంతో ఆ స్వరం ఇప్పుడు మరింత పెంచాడు. ఏకంగా ఎన్నికల సంఘం వైఖరినే తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశాడు.

ఎన్నికల సంఘాన్ని మహాభారతంలోని గుడ్డి వాడైన ధృతరాష్ట్రుడితో, బీజేపీ ని ధుర్యోధనుడితో పోలుస్తూ సాయం చేస్తోందని ఆరోపణలు కురిపించాడు. పుసక్తంలోని ప్రతీ అంశాన్ని వాడుకుంటూ తన కొడుకును ఎలాగైనా రాజును చేయాలని ధృతరాష్ట్రుడు ఎలాగైతే ట్రై చేశాడో ఇప్పుడు ఈసీ తీరు కూడా అలాగే ఉందంటూ విమర్శలు కురిపించాడు. నేను ఐఐటీ చదివిన ఓ ఇంజనీర్ ను. పొరపాటు మెషీన్లలో దొర్లలేదు. సాఫ్ట్ వేర్ మార్చి వాటిని ట్యాంపరింగ్ చేశారంతే అంటూ చెబుతున్నాడు. అన్నట్లు ఇదే కేజ్రీవాల్ ను అభిమన్యుడితో పోలుస్తూ ట్రోల్ పెడుతుంటారు కొందరు.

మధ్యప్రదేశ్ లో ఉపఎన్నికల కోసం చేసిన ఓ డెమో లో ఏ బటన్ నొక్కినా  బీజేపీ అభ్యర్థికే ఓట్లు  పడటంతో యూపీ ఎన్నికల్లో కూడా అలాగే జరిగి ఉంటుదని విపక్షాలు ఆరోపణలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఈసీ వివరణ ఇచ్చినప్పటికీ బ్యాన్ వేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నాయి. 13 పార్టీలు ఈ విషయమై త్వరలో రాష్ట్రపతి ప్రణబ్ తోపాటు ఎన్నికల సంఘం ను కలిసి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi CM Kejriwal  BJP  EVM Tampering  EC Dhritarashtra  

Other Articles