పెళ్లి కూతురు పూలకు బదులు వేటితో వచ్చిందో చూడండి | Bridesmaids Carried Puppies Instead Of Bouquets.

Bride shocks every one with puppy bouquets

Bridesmaids Bouquets, Meghan Butler Marriage, Meghan Butler Puppies, North Carolina Wedding, Bride with Puppies, Bride with Bouquets, North Carolina Wedding, New Wedding Trend, Bouquets Puppies

Bridesmaids Carried Puppies Instead Of Bouquets. Meghan Butler, a lawyer from North Carolina has set the most paw-dorable wedding trend. Instead of the usual tradition of bridesmaids holding bouquets while walking down the aisle, she made her eight bridesmaids carry 8 rescue puppies instead.

పెళ్లి రోజే వధువు స్వీట్ షాకిచ్చింది

Posted: 04/10/2017 01:53 PM IST
Bride shocks every one with puppy bouquets

నార్త్ కరోలినాకు చెందిన మెగాన్ బట్లర్ తన వివాహ వేడుకలో కొత్త సాంప్రదాయానికి తెర తీసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఏం చేసిందనేగా మీ అనుమానం. సాధారణంగా పెళ్లి కూతుళ్లు వేదిక వద్దకు చేరుకునే సమయంలో పూల బోకేలను చేతిలో పట్టుకుని వస్తుంటారు కదా! కానీ, ఆమె మాత్రం తన తోటి పెళ్లి కూతుళ్లంతా కలిసి కుక్క పిల్లలను మోసుకుని వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.

లాయర్ అయిన మెగన్ తన పెళ్లి రోజు జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా మంచి పని చేయాలనుకుంది. అందుకే ఓ నాలుగు జంతువులను దత్తత తీసుకోవాలని ఆ విషయాన్ని తన కాబోయే భర్త బ్రెట్ కు ముందే చెప్పి ఒప్పించింది. అయితే అక్కడున్న ఫోటోగ్రాఫర్ సహా బంధువలెవరికీ ఆ విషయం ముందుగా తెలీకపోవటంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. తర్వాత అసలు విషయం తెలుసుకుని మెగన్ ను అభినందించారు.

రెండు కుక్క పిల్లలు, రెండు పిల్లి పిల్లలతోసహా మొత్తం నాలుగింటిని ఆ కొత్త దంపతులు దత్తత తీసుకున్నారు. జంతువులకు ఆశ్రయం కల్పించటం, వాటిని సాకటం లాంటి కార్యక్రమాలను నిర్వహించే ఓ స్థానిక ఎన్జీవో పిలుపు మేరకు వారు స్పందించి విరాళం కూడా అందజేశారు. వేలకు వేలకు తగలేసి పెళ్లిళ్లు చేసుకునే వారికి ఈ వివాహం తప్పక ఆదర్శం అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి. నా హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ఓ మంచి పని చేశాను అని మెగన్ సంబర పడిపోతుంది. తనలాగే మరికొందరు ఇలా మూగజీవాలను దత్తత తీసుకోవాలంటూ పిలుపునిస్తోంది. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bride  Bridesmaids  Puppies  North Carolina  

Other Articles