మంగ్లీ గాళ్.. వానరములే తల్లీతండ్రీ..! 'Mowgli girl' found living with monkeys in UP

Young girl found living with monkeys in northern india

Mowgli Girl, Uttar Pradesh, Bahraich, Mogli, Katarniaghat Wildlife Sanctuary, girl with monkeys, trending, social media, viral news

Cops in Uttar Pradesh have found a girl who can neither speak nor behave like normal human beings. The 8-year-old girl was rescued by the police in Bahraich from a troop of monkeys.

ITEMVIDEOS: మంగ్లీ గాళ్.. వానరములే తల్లీతండ్రీ..!

Posted: 04/07/2017 05:43 PM IST
Young girl found living with monkeys in northern india

కోతులతో సావాసం.. మనుషులంటే భయం.. వినడానికి మీకు విచిత్రంగా వున్నా ఇది అక్షరాల నిజం.. జంగిల్‌బుక్‌లో మోగ్లీ కల్పిత కథ అయితే.. ఈ బాలికది మాత్రం నిజమైన గాధ. చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి అడవిలో జంతువులతో కలిసి పెద్దవాడైన మోగ్లీకి జంతువుల అలవాట్లే వచ్చినట్లు.. ఈ అమ్మాయికి కూడా అచ్చంగా వానరపు లక్షణాలే వచ్చాయి. వానరాలే తల్లిదండ్రై ఈ బాలికను పెంచాయి. ఉత్తరప్రదేశ్‌ అటవీశాఖ పోలీసులు ఈ బాలికను కనుగొని.. స్థానిక అసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ బాలిక కోతి మూకకు ఏ వయసులో దొరికిందో, ఎక్కడ దొరికిందో తెలియదు. బాలికను ఎక్కడి నుంచి తీసుకు వెళ్లాయో, ఏమో కానీ … ఆ కోతులు పాపను కంటికి రెప్పలా సాకాయి. గుంపులు గుంపులుగా ఉన్న కోతుల మధ్య ఆ బాలిక ఇన్నాళ్లుగా ఎలా ప్రమాదం బారిన పడకుండా ఉండగలిగిందో అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ బాలిక కనీసం మనుషుల్లాగా మాట్లాడటంగానీ, ప్రవర్తించడంగానీ చేయడం లేదు. పైగా మనుషులను చూసి తెగ భయపడుతోంది. ఇప్పుడా పాప నాగరిక సమాజంలో చిక్కుకుని, దిక్కుతోచని స్థితిలో ఉంది.

వివరాల్లోకి వెళితే.. బహ్రెయిక్‌ అటవీ ప్రాంతంలో నిత్యం మాదిరిగానే తన పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్ అటవీశాఖ ఎస్ఐ సురేష్ యాదవ్ కుమోతిపూర్‌ ప్రాంతంలో కటార్నియాఘాట్‌ వైల్డ్‌ లైఫ్‌సాంక్చూరీలో, కోతుల మధ్య ఉన్న ఓ ఎనిమిదేళ్ల బాలిక కనిపించింది. బాలికను తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కోతులు అతనిపై దాడికి యత్నించాయి. అవే కాదు బాలిక కూడా వాటిలాగానే తిరగబడేందుకు ప్రయత్నించింది. దీంతో సురేష్ యాదవ్ తన సిబ్బందికి, ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.

అటవీశాఖ సిబ్బంది కొందరు ఘటనాస్థలానికి చేరుకుని కోతుల నుంచి బాలికను వేరుచేసేందుకు ప్రయత్నించి అతికష్టం మీద సక్సెస్ అయ్యారు. వెంటనే బాలికను స్థానిక జిల్లా అస్పత్రికి తరలించారు. కాగా, అస్పత్రిలోనూ ఆ బాలిక అచ్చంగా కోతుల్లాగే అరుస్తూ.. మనుషులను చూడగానే అప్పుడప్పుడూ ప్రమాదకారిగా మారుతుంది. కాగా, వైద్యానికి స్పందిస్తోందని వైద్యులు చెబుతున్నారు. మెల్లగా మార్పు వస్తుందని అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాళ్ల సాయంతో నడవడం నేర్పిస్తున్నామని, అయితే అన్నం మాత్రం చేతులతో కాకుండా నేరుగా తింటుందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles