ఊహాగానాలకు చెక్.. రేసులో లేనన్న పెద్దాయన.. Advani Rules Himself Out of Presidential Race

After mohan bhagwat advani rules himself out of presidential race

lk advani next presidenty, president of india, lk advani to become president, lk advani rules himself of presidential race, mohan bhagwant next president, rss chief mohan bhagwat, pranab mukherjee, president of india, Presidential Race 2017, rss; sharad pawar

SC issues notice to six states, seeks their responses in a plea challenging certain laws that give protection to vigilante cow protection groups in the country

ఊహాగానాలకు చెక్.. రేసులో లేనన్న పెద్దాయన..

Posted: 04/07/2017 09:46 PM IST
After mohan bhagwat advani rules himself out of presidential race

బీజేపీ పెద్దాయన, పార్టీని తమ భుజస్కంధాలపై మోసి.. దేశవ్యాప్తంగా ఉనికి చాటేలా చేసిన సీనియర్ నేతల్లో అగ్రగన్యుడు లాల్ కిషన్ అద్వాని.. ఇవాళ సంచలన ప్రకటన చేశారు. గత కొంత కాలంగా దేశాధ్యక్ష పదవిపై వినబడుతున్న ఊహాగానాలకు అగ్రనేత చెక్ పెట్టారు. ఆయన చేసిన తాజా ప్రకటనతో బీజేపి నేతలతో పాటు ఆయన అభిమానులను కూడా ఆయన ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశారు. ఇంతకీ ఆయన ఏమి ప్రకటన చేశారో తెలుసా..?

రాష్ట్రపతి రేసులో తాను లేనని ప్రకటించారు. దీంతో బీజేపీ వర్గాలతో పాటు ఆయన అభిమానులు కూడా విస్మయం వ్యక్తం చేశాయి. పార్టీ అగ్రనేత ఎందుకిలాంటి అకస్మిక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ కలవరం చెందారు. ఇవాళ సాయంత్ర పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సెన్సెషన్ అయ్యాయి. సర్వసాధారణంగా ఆయన అలోచించి కానీ ఏ నిర్ణయం తీసుకోరు. అలాంటిది అకస్మికంగా ఈ అనూహ్య నిర్ణయానికి ఎందుకు వచ్చారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రణబ్ ముఖర్జీ పదవి కాలం ముగుస్తుండటంతో రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్రంలోని మోడీ సర్కార్ కసర్తుతును ప్రారంభించింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాను రేసులో లేనని స్పష్టం చేసిన తరువాత కూడా అద్వాని ఇలాంటి నిర్ణయం ఎదుకు తీసుకున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీజేపీ నుంచి రాష్ట్రపతి రేసులో అద్వానీ ఉన్నారంటూ, మోదీ కూడా అద్వానికి సముచిత స్థానం కల్పించేందుకు ఇదే అవకాశమని భావిస్తున్నట్లు జాతీయ మీడియా ఇన్నాళ్లూ కోడై కూసింది. అయితే అద్వాని ప్రకటనతో తదుపరి రాష్ట్రపతి రేసులో బీజేపీ నుంచి ఎవరుంటారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles