పదవులు దక్కని వారిని ఎలా కూల్ చేేస్తున్నాడంటే... | Chandrababu new plan for Unhappy MLAs.

Chandra babu trying to cool mlas with nominated posts

Chandra Babu Unhappy MLAs, AP New Cabinet, Chandrababu Nominated Posts, Chandra Babu Opset MLAs, AP MLAs Denied in Cabinet Berth

AP CM Chandra Babu new plan for upset MLAs who were denied Cabinet berths with nominated posts.

అసంతృప్తులను అలా చల్లబరుస్తాడన్న మాట

Posted: 04/04/2017 10:23 AM IST
Chandra babu trying to cool mlas with nominated posts

ఆంద్రప్రదేశ్ అధికార పక్ష పార్టీలో మంత్రివర్గ విస్తరణ పెద్ద చిచ్చే పెట్టింది. పదవులు పొందలేకపోయిన వారు పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు యత్నించటం, అధినేత చంద్రబాబు వారిని బెదిరించినట్లే బెదిరించి  బుజ్జగించేందుకు బరిలోకి దిగటం చూశాం. బొజ్జల గోపాలకృష్ణ, శివాజీ, చింతమనేని మొదలైన వారు కాస్త శాంతించగా, కాగిత ఏకంగా ముఖ్యమంత్రిని కలసి తన గోడును వెల్లగక్కుకున్నాడు. ఇక కాస్త బెట్టు చేస్తున్న గోరంట్లతో మంత్రి చినరాజప్ప సమావేశం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. ఇక వారిని సంతృప్తి పరిచే విధంగా ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మండలిలో ఖాళీగా ఉన్న కీలక పదవులతో పాటు పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులను నేతలకు కట్టబెట్టే దిశగా యత్నాలు మొదలుపెట్టిన చంద్రబాబు ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే పలువురి పేర్లతో కూడిన జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రివర్గంలో 26 మందికి మించి చోటు కల్పించలేని పరిస్థితులు ఉన్నాయంటూ ఓపెన్ గానే ప్రకటన చేసిన ఆయన ఇతర నేతలకు మండలిలో త్వరలో ఖాళీ అయ్యే పలు పదవులను ఇవ్వనున్నారు.

లిస్ట్ లో ఉంది వీరేనా?

శాసనమండలి చైర్మన్ చక్రపాణిరెడ్డి మే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ అవకాశం కర్నూల్ కీలక నేత అయిన శిల్పా చక్రపాణిరెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. భూమా వర్గానికి ఓ మంత్రి పదవి ఇవ్వడం, శాసనసభకు ఆంధ్రా ప్రాంత నేత సభాపతిగా ఉండటంతో, శిల్పాకు లైన్ క్లియర్ అయినట్లేనని అనుకోవాలి. మండలి చీఫ్ విప్ పదవిని పయ్యావుల కేశవ్ కు ఇచ్చి, అయనకు క్యాబినెట్ హోదాను కల్పించాలని, రెండు, మూడు విప్ పదవులకు అన్నం సతీశ్, బుద్ధా వెంకన్న, బీద రవిచంద్ర, యలమంచిలి బాబూరాజేంద్ర ప్రసాద్, చిక్కాల రామచంద్రరావు తదితరుల పేర్లను ఆయన తుది దశ వడపోతలో పరిశీలిస్తున్నారు.

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను అదే సమయంలో భర్తీ చేయాల్సి వుంది. వీటిల్లో ఒకటి కడప జిల్లాకు చెందిన రామసుబ్బారెడ్డికి ఇప్పటికే ఖరారైపోయింది. రెండో స్థానానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును మంత్రివర్గంలోకి తీసుకున్నందున ఆయన స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే విషయమై, మేలో జరిగే మహానాడులో నిర్ణయం వెలువడవచ్చని తెలుస్తోంది.

ఎమ్మెల్సీలుగా కూడా ఎంపిక చేయలేకపోయిన వారిని కార్పొరేషన్ చైర్మన్లుగా నియమిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పలు కార్పొరేషన్లతో పాటు ఆలయ కమిటీలను భర్తీ చేస్తే, తృతీయ శ్రేణి నాయకుల వరకూ అందరినీ సంతృప్తి పరచవచ్చని, ఈ ప్రక్రియను వచ్చే నాలుగైదు నెలల్లో పూర్తి చేసి ఆపై 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలన్నది చంద్రబాబు అభిమతంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి తెలుగుదేశం అధినేత కేబినెట్ ర్యాంకుతో కూడిన ఒక పదవిని ఆఫర్ చేశారట. ప్రభుత్వ సలహాదారుగా నియమించే హామీతోనే బొజ్జల వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇక పదవిని పోగొట్టుకున్న మరో నేత పల్లె రఘునాథ రెడ్డికి ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని ఇస్తామని బాబు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొన్నటి వరకూ ఈ పదవిలో కాలువ శ్రీనివాసులు ఉండే వారు. ఇప్పుడు అది పల్లెకు దక్కబోతోందని సమాచారం. ఇక మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుని ఫిరాయింపుదారుల్లో ఒకరికి విప్ పదవి దక్కనున్నట్టుగా తెలుస్తోంది. కానీ, కేవలం మంత్రి పదవుల కోసమే ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న పెద్ద చేపలకు ఈ ఎర ఏ మేర సరిపోతుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CM Chandra Babu Naidu  Upset MLAs  Nominated Posts  

Other Articles