కాటమరాయుడుపై కేటీఆర్-పవన్ పరస్పర ట్విట్లు.. KTR impressed by Katamarayudu

Unexpected ktr surprise for katamarayudu

KTR, Pawan Kalyan, Katamarayudu, Pawan Fans, Katamrayudu Show, Telangana,

K T Rama Rao and Ram Charan have been seen together often, but the same can’t be said about the Minister with Pawan Kalyan.

కాటమరాయుడుపై కేటీఆర్-పవన్ పరస్పర ట్విట్లు..

Posted: 03/26/2017 02:56 PM IST
Unexpected ktr surprise for katamarayudu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు” సినిమాను తెలంగాణా ముఖ్యమంత్రి తనయుడు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వీక్షించారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ కు మంచి విజయం దక్కిందని నిర్మాత శరత్ మరార్ ను అభినందించారు. అలాగే హ్యండ్లూమ్స్ ను ప్రోత్సహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, ఇందుకు గానూ పవన్, మరార్ లను ప్రశంసించారు కేటీఆర్. అలాగే పవన్ తో కలిసి ఓ సెల్ఫీలో కనిపించాడు కేటీఆర్.

సాధారణంగా సెల్ఫీ వంటి ట్రెండీ ఐటమ్స్ కు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్, ఇటీవల మాత్రం వరుసగా సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. తెలంగాణాలో కూడా తన ‘జనసేన’ ఉంటుంది, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేస్తామని ఇటీవల స్పష్టం చేసిన నేపధ్యంలో… అధికార పార్టీ అధినేత తనయుడితో పవన్ సెల్ఫీ దిగడంపై రాజకీయంగా తెలంగాణాలో పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

అయితే కేటీఆర్ ట్విట్ పై స్పందించిన జనసేనాని పవన్ కల్యాన్.. కాటమరాయుడు చిత్రాన్ని చూసినందుకు కేటీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ను అనుసంధానంగా చేసుకుని తాను కేటీఆర్ ను ఎక్కడ కలిసింది. ఎక్కడ సెల్పీ తీసుకున్నామన్న విషయన్ని చెప్పారు పవన్. ఇటీవల ఓ డిన్నర్ లో కేటీఆర్ తో కలిశానని చెప్పారు. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య చేనేత కార్మికుల అంశాలపై చర్చంచామని అన్నారు పవన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Pawan Kalyan  Katamarayudu  Pawan Fans  Katamrayudu Show  Telangana  

Other Articles