బిజీ నైట్ క్లబ్ లో కాల్పులు.. ఉగ్రవాదులు కాదా? | No Indications Ohio Nightclub Shooting is Terrorism.

One killed in shootout at us nightclub

Cincinnati Club, US Nightclub Attack, Nightclub Shooting, Cincinnati Attack, Nightclub Terror Attack, Nightclub Attack, Cincinnati, US Breaking News, International News, America Attack

Two attackers open fire inside crowded US nightclub. Cincinnati club Shooting 15 People Shot, one person killed. Police Say No Indications Ohio Nightclub Shooting is Terrorism Related.

నైట్ క్లబ్ ఎటాక్.. టెర్రరిస్టుల పనేనా?

Posted: 03/27/2017 08:01 AM IST
One killed in shootout at us nightclub

ఓవైపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో పాటు, జాత్యహంకార దాడులు అగ్రరాజ్యాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ఉగ్రవాద అనుమానిత దాడులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓ నైట్ క్లబ్బులో ఇద్దరు దుండగుడు కాల్పులకు తెగబడటంతో ఒకరు చనిపోగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సిన్సినాటీ నగరంలోని కెల్లోగ్‌ అవెన్యూలో ఉన్న కేమియో క్లబ్‌ లో ఈ దాడి చోటు చేసుకుంది.

వీకెండ్ కావటంతో క్లబ్బుకి చేరిన అంతా మైమరచి చిందులేస్తూ, మందు కొడుతూ ఆనందంగా ఉన్న వేళ, గన్ పట్టుకున్న ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో క్లబ్ లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఇది ఉగ్రవాద చర్యగా తాము భావించటం లేదని పోలీసులు చెప్పటం గమనార్హం. ఏది ఏమైనా ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు.
ఒకప్పుడు సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అగ్రదేశాలు, ఇప్పుడు ఉగ్ర దాడులతో విలవిలలాడిపోతున్నాయి. ఆ మధ్యన ఫ్లోరిడాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో జరిగిన కాల్పుల ఘటనలో49 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US Nightclub Attack  Cincinnati  Terror Attack  

Other Articles

Today on Telugu Wishesh