కాటమరాయుడు ఫస్ట్ టాక్.. రియాక్షన్ | Reaction on Pawan Kalyan katamarayudu First Show.

Pawan kalyan katamarayudu first talk

Pawan Kalyan, Katamarayudu, Katamarayudu Release, PK Katamarayudu, Katamarayudu First Talk, Katamarayudu Overseas Report, Katamarayudu Twitter Reaction, Katamarayudu Inner Talk

Pawan Kalyan's Katamarayudu fist talk.

పవన్ కాటమరాయుడు.. ఫస్ట్ టాక్

Posted: 03/24/2017 08:04 AM IST
Pawan kalyan katamarayudu first talk

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ సందడి తెలుగు రాష్ట్రాలలో ఈ ఉదయం నుంచే మొదలైంది. చాలాసేపు వెయిటింగ్ చేశాక ఇప్పుడు హైదరాబాద్ లో పీకే ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. వారు త్వరత్వరగా 12 గంటలుకే సినిమా చూసేద్దాం అనుకుంటే.. చివరకు బెనిఫిట్ షో క్యాన్సిల్ చేయక తప్పలేదు. దీంతో నిరాశ చెందిన అభిమానులు థియేటర్ల దగ్గర రచ్చ చేయగా, లాఠీ చార్జీతో పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. ఏలూరులో మాత్రం రాత్రి 12 కే షో పడింది.

ఇక కువైట్, మస్కట్ దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకుల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో పవన్ చాలా హుషారుగా కనిపించాడని అంటున్నారు. గతంలో ఫ్యాక్షన్ సబ్జెక్ట్ మూలాలు ఉన్న సినిమా తీసినప్పటికీ కంప్లీట్ గా సినిమా అంతటా పంచెకట్టుతో కనిపించే పవర్ ఫుల్ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. ఇక శ్రుతి హాసన్ తో లవ్ ట్రాక్ బాగా పండిందని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

డ్యాన్స్ పై మరింతగా పవన్ దృష్టి పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డ ప్రేక్షకులు, ఎమోషనల్ గా క్లైమాక్స్ రసవత్తరంగా ఉందని అంటున్నారు. స్టోరీలో పెద్దగా మార్పులు చేయకపోయినప్పటికీ, పవన్ క్యారెక్టరైజేషన్ ను మాత్రం తమిళంలో కన్నా బాగా మార్చారని అంటున్నారు. ఓవరాల్ గా చిత్రంలో పవర్ ఫుల్ డైలాగులు, ఫైట్లతో పవన్ వన్ మ్యాన్ షో చేశాడని, సినిమా బ్లాక్ బస్టర్ అని పవర్ స్టార్ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో రివ్యూ రానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Katamarayudu  FIrst Talk  

Other Articles