స్పీడ్ డ్రైవింగే రేసర్ దంపతులను బలితీసుకుందా.? Racer Ashwin Sundar, wife charred to death after their BMW catches fire

Racer ashwin sundar wife charred to death after their bmw catches fire

BMW car, professional racer, Ashwin Sundar, Nivedhitha, Santhome High Road, chennai, accidents, bmw cathes fire, crime

Professional car racer Ashwin Sundar and his wife Nivedhitha were charred to after the BMW they were driving rammed into a roadside tree on Santhome High Road in Chennai.

ప్రోఫెషనల్ రేసర్ దంపతులను బలితీసుకున్న స్పీడ్ డ్రైవింగ్

Posted: 03/18/2017 12:41 PM IST
Racer ashwin sundar wife charred to death after their bmw catches fire

తమిళనాడులో ఘోర విషాదం సంభవించింది. భారత ఫ్రోపెషనల్ రేసర్ ను స్పీడ్ డ్రైవింగే బలితీసుకుందన్న వార్తతో చెన్నై నగరం నిద్రలేస్తూనే కలవరపాటుకు గురైంది. నేషనల్ కారు రేసింగ్ చాంపియన్ అయిన అశ్విన్ సుందర్.. కారులోనే మంటలు చెలరేగి తన భార్యతో సహా సజీవ దహనం కావటం రేసింగ్ అభిమానులను విషాదంలో ముంచివేసింది. ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది.

రేసర్ అశ్విన్ సుందర్, అతని భార్య నివేదితతో కలసి బిఎండబ్యూ కారులో చెన్నైలోని శాంతమ్ హైరోడ్డు ప్రాంతంలో వెళ్తుండగా, అదుపుతప్పిన కారు అదే వేగంతో రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఆ తరువాత చెట్టు పక్కనున్న గోడను వైపు దూసుకెళ్లి.. ఇరుకుపోయింది. క్షణాల వ్యవధిలో మంటలు ఒక్కసారిగా బిఎండబ్యూ కారులో మంటలు చెలరేగాయి. ఈ టైంలో బయటకు వచ్చేందుకు ప్రయత్నించి, కారు డోర్స్ తెరుచుకోకపోవడంతో విఫలమయ్యారు.

కారు అద్దాలు పగులగొట్టి బయటపడదామని కూడా ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అయితే అలోపు కారు మొత్తం మంటల్లో చిక్కుకోవడంలో వారు కూడా కారుతో పాటు అహుతయ్యారు. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వారిని కాపాడేవారు కూడా కరువయ్యారు. రోడ్లు నిర్మానుష్యంగా వుండటం, స్థానికులు ఎవరూ బయటకు రాకపోవడంతో అశ్విన్ సుందర్, అతని భార్య నివేదిత సజీవ దహనం అయ్యారు. అయితే బీఎండబ్యూ కారు డోర్ ఎందుకు తెరుచుకోలేదు..? ఎయిర్ బ్యాగ్స్ వున్నాయా..? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles