గాంధీ అస్పత్రిలో తిష్టవేసిన డూప్లి‘కేటుగాళ్లు’.. man pretending as doctor stolen mangalsutra from patient

Man pretending as doctor stolen mangalsutra from patient

gandhi hospital, doctor, theves, theft, mangalasutra, patient, chilakalguda police station, gynae problem, gynaecology department

In a shocking incident, man pretending as doctor stolen mangalsutra from patient in gandhi hospital after asking her to remove them.

గాంధీ అస్పత్రిలో తిష్టవేసిన డూప్లి‘కేటుగాళ్లు’..

Posted: 03/18/2017 11:03 AM IST
Man pretending as doctor stolen mangalsutra from patient

పైన దగా, కింద దగా, కుడి ఎడమల దగా, దగా, అంటూ ప్రముఖ కవి శ్రీరంగం శ్రీనివాసులు గారు చెప్పింది అక్షరాల నిజం. దీనికి అనుభవం కావాలంటే ఓ సారి మన దగ్గర్లోని గాంధీ ఆస్పత్రికి వెళ్తేచాలు. ఔనండీ.. డబ్బు చేతిలో పడకపోతే రోగుల బాధను ఏమాత్రం అర్థం చేసుకోకుండా నిర్థాక్షిణ్యంగా గెంటేసే సిబ్బందే కాదు.. డాక్టరును కలవాలన్నా.. సిబ్బంది చేయి తడపాల్సిందే. ఇక వీరికి తోడు మోసగాళ్లు, నయవంచకులు మంచితనం ముసుగు కప్పుకుని సంచరించే స్థలమే గాంధీ అసుపత్రి.

అస్పత్రిలో వైద్యులుంటారు తమ బాధలను విని.. రోగాలు తగ్గేందుకు మందులిస్తారు అని కొండంత ఆశతో అస్పత్రి గుమ్మాన్ని తొక్కే పేద, మధ్య తరగతి ప్రజలు.. తాము క్షేమంగా ఇంటికి చేరుకున్నే వరకు వారికి రోగాలతో పాటు కేటుగాళ్ల అందోళన ఓవైపు, సిబ్బంది అవినీతి మరోవైపు వేధిస్తూనే వుంటాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే గతంలో గాంధీ అస్పత్రిలో ఇలాంటి అనేక ఘటనలు జరిగినా.. క్రమంగా పోలీసుల నిఘా, సివిల్ పోలీసుల గస్తీతో అవి తగ్గుముఖం పట్టాయి.

కాగా తాజాగా గర్భాశయ వ్యాధితో అస్పత్రికి వెళ్లిన ఓ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని  వైద్యుడి వేషంలో వున్న డూప్లికేటుగాడు అపహరించాడు. అదెలా అంటే.. మౌలాలీకి చెందిన రమా అనే మహిళ గర్భాశయ వ్యాధితో అస్పత్రికి వెళ్లింది. చికిత్స నిమిత్తం ఆమెకు ఇంజెక్షన్‌ చేయాలని, మంగళసూత్రం అడ్డుగా ఉందని, ఆ గొలుసును తీయాలని వైద్యుడు చెప్పాడు. అమె తన మంగళసూత్రాన్ని అలా తీయగానే.. ఇలా చటక్కున కాజేసి మాయమయ్యాడు. ఇంజెక్షన్ చేస్తానన్న డాక్టరు బయటకెళ్లి ఇంకా రావడం లేదని రమా లేచి తన తాళిబోట్టును మెడలో వేసుకుందామని చూడాగా అది కనిపించలేదు.

షాక్ కు గురైన రమా తన తాళిబోట్టును డాక్టరు వేషంలో వచ్చిన డూస్లికేటుగాడు అపహరించాడని తెలుసుకుంది. తన రోగం మాట దేవుడెరుగు.. వున్న మంగళసూత్రం కూడా పోయిందని రోదించింది. దీంతో అక్కడకు చేరుకున్న అస్పత్రి సిబ్బంది అమెను డూప్లికేటుగాళ్లు మోసం చేశారని, అమె వద్దకు డాక్టర్లు రాలేదని అన్నారు. దీంతో చేసేది లేక చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అస్పత్రిలోని సిసిటీవీ ఫూటేజీలను కూడా పరిశీలిస్తున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gandhi hospital  doctor  theves  theft  mangalasutra  patient  chilakalguda police station  crime  

Other Articles