ఆస్తుల వివరాల్లో ఇక తప్పుల్లేవ్.. అన్ని మార్కెట్ ధరలోనే.. nara lokesh explains on his assets value growth

I can explain says nara lokesh about very good fortune

Nara Lokesh, Chandrababu Naidu, Nara Lokesh assets, Andhra Pradesh, Heritage Foods, Heritage Foods shares, Lokesh Nara, Telugu Desam Party

Politician Nara Lokesh says a reported quantum leap in his fortune is being widely misunderstood and distorted, which has brought special scrutiny to his declared assets.

ఆస్తుల వివరాల్లో తప్పుల్లేవ్.. అన్ని మార్కెట్ ధరలోనే..

Posted: 03/09/2017 06:18 PM IST
I can explain says nara lokesh about very good fortune

తన ఆస్తులపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. పదేళ్లుగా తాను హెరిటేజ్ షేర్లను కొనుగోలు చేస్తున్నానని.. అయితే ఇన్నాల్లు షేర్లు కొంటున్న విలువను మాత్రమే తాను తన అస్తుల చిట్టాలో చూపానని, అయితే ఇప్పుడు మాత్రం మార్కెట్ విలువను చూపానని అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌లో పేర్కొన్న ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై నారా లోకేశ్‌ వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబం అంతా స్వచ్చందంగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నామన్నారు. ఎవరూ అడగకుండానే తాము ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. తనపై కావాలనే బురద జల్లుతున్నారని ఆయన అన్నారు.

ఆస్తులకు సంబంధించి మార్కెట్‌ ధర ప్రకటించాలనేది ఈసీ నిబంధన అని.. ఈసీ నిబంధనను ప్రతిపక్షం కావాలనే విస్మరిస్తోందన్నారు. పనిలో పనిగా ప్రతిపక్ష నేత జగన్ పై కూడా ఆయన విమర్శలు చేశారు. 12 కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్న జగన్‌ ఏనాడైనా తన ఆస్తులను ప్రకటించారా? అని లోకేశ్‌ ప్రశ్నించారు. అయితే తాను ప్రకటించిన అస్తుల్లో ఇక తప్పులేవని, అన్ని మార్కెట్ ధరలోనే వున్నాయని నారా లోకేష్ చెప్పుకోచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles