ఓనర్ తో పాటుగా బైక్ ఈడ్చుక్కెళ్లిన పోలీసులు Cops tow away bike along with owner

Cops tow away bike along with owner as he refuses to get down

Uttar Pradesh, reserve bank of india, Motorbike, Mobile footage, Fearless Act, comical, Kanpur, Uttar Pradesh, police over action, Accident

A comical but fearless act came to light in Uttar Pradesh's Kanpur, when the city traffic police towed a motorbike with the owner as he refused to get down from the bike.

ITEMVIDEOS: ఓవర్ యాక్షన్: ఓనర్ తో పాటుగా బైక్ ఈడ్చుక్కెళ్లిన పోలీసులు

Posted: 03/09/2017 01:59 PM IST
Cops tow away bike along with owner as he refuses to get down

ఉత్తర్ ప్రదేశ్ లో శాంతిభద్రతలపై ఇప్పటికే చర్చనీయంశమైన నేపథ్యంలో అక్కడి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ఎంచుకున్న మార్గం కూడా అంతేస్థాయిలో సంచలనంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అక్కడ చోటుచేసుకుంటున్న నేరాలను కూడా ప్రచారాస్త్రాలుగా సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ క్రమంలో అక్కడి పోలీసులు ఓ బైక్ యజమానితో వ్యవహరించిన తీరుపై కూడా నెట్ జనులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.

ఎంతలా అంటే కొందరు బైక్ యాజమానిదే తప్పంటూ వాదిస్తుండగా, మరికోందరు మాత్రం పోలీసులదే ఓవర్ యాక్షన్ అనే స్థాయి వరకు కామెంట్లను పోస్టు చేస్తున్నారు. ఎవరి అభిప్రాయాలతో వారు ముందుకెళ్తున్న తరుణంలో అది కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారింది. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ గా మారింది. ఇదంతా పక్కన బెడితే అసలు విషయం చెప్పండీ మా అభిప్రాయం మేమూ చెబుతాం అంటున్నారు కదూ..

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నిత్యం ట్రాపిక్ అధికంగా వుంటుందన్నది జగమెరిగిన సత్యం. అయితే అక్కడ నో పార్కింగ్ ప్రాంతంలో ఓ బైక్ యజమాని తన బైక్ ను పార్క్ చేసి వెళ్లాడు. ట్రాపిక్ ఇబ్బందులను క్లియర్ చేసేందుకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ లో వున్న బైక్ క్రేన్ తో లాగేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో అక్కడికి పరుగు పరుగు వచ్చిన బైక్ యజమాని దానిని చూసి బైక్ వదిలిపెట్టండీ అంటూ ప్రాదేయపడ్డాడు.

బైక్ ను విడిచిపెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరాకరించారు. దీంతో తన బైక్ పై యజమాని కూర్చుండిపోయాడు. దిగేందుకు ససేమిరా అన్నాడు. పోలీసులు ఇప్పడు అతన్ని దిగాల్సిందిగా అదేశించాడు. అయినా తాను బైక్ దిగనంటూ మంకుపట్టు పట్టుకుకూర్చున్నాడు. ఇక చేసేది లేక పోలీసులు బైక్ తో పాటుగా యజమానిని కూడా తమ క్రేన్ సాయంతో లాక్కెల్కారు. ఇది చూసిన స్థానికులు తమ సెల్ పోన్ లోని కెమెరాలకు పనిచెప్పగా.. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఇలా చేయడం ప్రమాదకరమని మనిషకి ఏమైనా అయ్యింటే పోలీసులు సమాధానం చెప్పేవారా..? అంటూ అనెట్ జనులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు మీరే చెప్పండీ ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh