తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఏపీలో 50, తెలంగానలో 34.. Telugu states assembly seats to get increased.?

Telugu states assembly seats to get increased

state reorganistation bill, assembly seats, andhra pradesh, telangana, telugu states, administrative reports on increase of assembly seats, union government, union law ministry, union home ministry, pm modi, rajnath singh

center proposes to keep increase in telugu states assembly constituencies bill in next parliamentary session as per state reorganistation bill

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఏపీలో 50, తెలంగాణలో 34..

Posted: 03/09/2017 12:16 PM IST
Telugu states assembly seats to get increased

ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించే పనిలో వుంది. అదేంటంటారా..? రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి తమ సత్తాను చాటాలనుకుంటున్న వారికి ఇది మిఠాయి లాంటి వార్త. రాష్ట్ర పునర్విభజన నేపథ్యంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెరమీదకు తీసుకువచ్చిన పలు అంశాలలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ పెంపు కూడా ఇమిడివుంది. దీంతో అ హామీని అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడ తాజాగా అమలు పర్చాలని ప్రయత్నిస్తుంది. ఈ వార్త ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలకూ శుభవార్తే.

అధికారంలోకి వచ్చాక అటు టీఆర్ఎస్, ఇటు టీడీపీల్లోకి వలసలు పెరిగాయి. పెద్ద సంఖ్యలో పార్టీల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వీలైనంతమందికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో చేరిన వారికి, పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం చేయాలని టీఆర్ఎస్, టీడీపీలు భావించాయి. నియోజకవర్గాల పెంపుతో అది సాధ్యమవుతుందన్న నమ్మికతో వారికి ఎడాపెడా హామీలిచ్చాయి. అయితే, కొంతకాలంగా ఈ విషయంలో ఎటువంటి కదలిక లేకపోవడంతో కొంత నిరుత్సాహం చెందాయి. తాజాగా ఇప్పుడీ ప్రతిపాదనలో కదలిక రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం ఏపీలో ఉన్న 175 స్థానాలను 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు  అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంది. ఈ విషయంలో గత కొంతకాలంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నియోజకవర్గాల పెంపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ మేరకు ‘అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్’ పంపాలని కేంద్ర నాయశాఖ రెండు తెలుగు రాష్ట్రాలను కోరింది. లోక్‌సభ  స్థానాల పెంపు సాధ్యం కాకపోవడంతో వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలను మాత్రం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను తొమ్మిదికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : state reorganistation bill  assembly seats  andhra pradesh  telangana  telugu states  

Other Articles