ఏటీయం నుంచి మరోసారి బొమ్మ నోటు.. vizianagaram karur vysya bank atm dispensed fake note

Vizianagaram karur vysya bank atm dispensed fake note

karur vysya bank, fake note, atm, Ampavalli Chinnarao, lineman, vizianagaram, fake 500 note, fake notes in atm, vijayanagaram atm fake note

Ampavalli Chinnarao, who is working as lineman in vizianagaram was got a fake Rs500 note from Karur Vysya bank ATM

ఏటీయం నుంచి మరోసారి బొమ్మ నోటు..

Posted: 03/09/2017 11:28 AM IST
Vizianagaram karur vysya bank atm dispensed fake note

ఓ వైపు బ్యాంకులు అప్పుడే బాదుడుకు రంగం సిద్దం చేసిన తరుణంలో.. బ్యాంకు ఏటీయంలకు వెళ్లే ఖాతాదారులకు నో క్యాష్ బోర్డులు స్వాగతం పలుకుతున్నాయి. అయినా నాలుగు లావాదేవీలేనంటూ.. బ్యాంకులు మాత్రం ముక్కుపిండి మరీ ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీంతో అనేక అసంతృప్తుల మధ్య బ్యాంకు ఏటీయంలకు వెళ్లి గత్యంతరం లేక డబ్బుల కోసం క్యూ కడుతున్న ఖాతాదారులకు డబ్బులను డ్రా చేసిన తరువాత వాటిని పరిశీలించి చూస్తే విస్మయానికి గురికాక తప్పడం లేదు.

ఈ నేపథ్యంలో తాజాగా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తికి గోరు జుట్టుపై రోకటి పోటు అన్న తరహాలో బ్యాంకు వాయింపులకు బదులు ఏటీయం వాయిింపులు కూడా అదనంగా పడింది. అదేంటంటే బ్యాంకు ఏటీయం అతనికి ఓ వింత నోటు ఇచ్చింది. తీరా అది నకిలీ నోటు అని తెలుసుకున్న ఖాతాదారుడు నెత్తినోరు బాదుకుంటున్నాడు. దీంతో ఈ వార్త స్తానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఏటీఎం నుంచి 'ఫుల్ ఆఫ్ ఫన్' పేరుతో రూ.500 నోటు రావడంతో సదరు వ్యక్తి అవాక్కయ్యాడు.

విజయనగరం జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న లైన్ మెన్ అంపావల్లి చిన్నారావుకు కరూర్ వైశ్యా బ్యాంకులో ఈ అనుభవం ఎదురైంది. దానిలోంచి నకిలీ రూ.500 నోటు వచ్చింది. ఫన్‌తో పాటు దానిపై మనోరంజన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అని ఉంది. నోటు మీద ఉండే నంబర్లన్నీ సున్నాలుగానే ఉన్నాయి. నకిలీ నోట్లు, చిన్నారులు ఆడుకునే నోట్లు కూడా బ్యాంకు ఏటీఎంల నుంచి వస్తుండడంతో అందరూ విస్తుపోతున్నారు. దీనిపై బ్యాంకు అధికారులను పిర్యాదు చేయడానికి వెళ్లాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ampavalli Chinnarao  karur vysya bank  fake note  atm  vizianagaram  fake 500 note  

Other Articles

Today on Telugu Wishesh