ఉగ్రవాదులకు పోలీస్ వార్నింగ్.. మీకు కుటుంబాలున్నాయ్.. Kashmir DGP warns militants, You too have families

Kashmir dgp warns militants after attack on cop s home you too have families

Shesh Paul Vaid, kashmir, Jammu, Terrorist attack in Kashmir, Jammu and Kashmir Police, DGP, militants, Burhan Wani, Hizbul

The Jammu and Kashmir police chief shesh paul vaid terrorists to desist from attacking the families of police personnel in Kashmir valley.

ఉగ్రవాదులకు పోలీస్ వార్నింగ్.. మీకు కుటుంబాలున్నాయ్..

Posted: 03/09/2017 09:39 AM IST
Kashmir dgp warns militants after attack on cop s home you too have families

ఉగ్రవాదులకు పోలీసులు వార్నింగ్ ఇవ్వడం ఇప్పడు సంచలనంగా మారిపోయింది. ఇన్నాళ్లు తీవ్రవాదులు పోలీసులకు వార్నింగ్ ఇస్తూ.. వారిని భయాందోళనకు గురి చేసిన ఘటన వున్నాయి. కానీ తాజాగా ఓ పోలీసు అధికారి నేరుగా ముష్కరులకు వార్నింగ్ ఇవ్వడం వైరల్ గా మారింది. పోలీసులకు మాత్రమే కుటుంబాలు వుంటాయని ఉంటాయని, వారిని ఆ కోణంలో టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు వారి కుటుంబ సభ్యులపై దాడులు పాల్పడిన ఘటనలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ అధికారి హెచ్చరికలు ఉగ్రవాదులు కుటుంబాలలో కూడా భయాందోళనలు రేపుతున్నాయి.

మరీ ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం నమోదు అవుతున్న తరుణంలో దీనిపై ధీటుగా స్పందించారు  జమ్మూకశ్మీర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌పీ వేడ్‌. కుటుంబాలు కేవలం పోలీసులకు మాత్రమే లేవు.. మిలిటెంట్లకు కూడా వున్నాయంటూ వార్నింగ్‌ ఇచ్చారు. పోలీసుల ఇళ్లపై దోపిడీలకు దిగి బెదిరింపులకు పాల్పడే వారికి కూడా కుటుంబాలు ఉన్నాయనే సంగతి గుర్తించుకుని ప్రవర్తిస్తే మంచిదని అన్నారు. అనవసరంగా కుటుంబాలను సమస్యల్లోకి లాగొద్దని చెప్పారు.
 
పోలీసుల కుటుంబాలను వేధిస్తే.. అదే తరహాలో తాము కూడా ఉగ్రవాదుల కుటుంబాలను వేధిస్తామని అన్నారు. మంగళవారం ఓ పోలీసు ఇంట్లో చొరబడిన ఉగ్రవాదులు సొత్తు దోచుకుని వెళ్తూ ఉద్యోగం మాన్పించాలని అతని కుటుంబసభ్యులను బెదిరించారు. గత శనివారం షోపియన్‌లో జరిగిన మరో సంఘటనలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఇంటిపై దాడి చేసిన పది మంది మిలిటెంట్లు ఇంట్లో వస్తువులను ధ్వంసం చేసి ఉద్యోగానికి రాజీనామా చేయాలని బెదిరించారు. ఘటనలను సీరియస్‌గా తీసుకున్న డీజీపీ వేడ్‌ టెర్రరిస్టులకు హెచ్చరికలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shesh Paul Vaid  kashmir  Jammu  Terrorist attack in Kashmir  Jammu and Kashmir Police  

Other Articles