ట్రంప్ అప్ డేటెడ్ వర్షన్ వచ్చేస్తోంది Trump updated travel ban act.

Trump no compromise on travel ban

America Travel Ban, Travel Ban Federal Court, seven Muslim-Majority Countries, America Travel Ban, Donald trump New Act, Donald Trump Update, Donald Trump Court, America President Donald Trump

American President Donald Trump’s controversial executive order banning travel from seven Muslim-majority countries is being tightened up. To get around legal and constitutional objections with minimal input from the National Security Council,

ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. తగ్గేది లేదంతే...

Posted: 02/18/2017 08:26 AM IST
Trump no compromise on travel ban

కోర్టులను ఖాతరు చేయకుండా తన నిర్ణయాలపైనే మొండిగా ముందుకు వెళ్తు పాలనపై పట్టుసాధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిసైడ్ అయ్యాడు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించి విమర్శలు కొని తెచ్చుకున్న ట్రంప్ మరోమారు అటువంటి ఉత్వర్వుల జారీకి సిద్ధమవుతున్నారు. పాత ఉత్వర్వుల్లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. మరో వారంలోనే కొత్త కార్యనిర్వాహక ఉత్వర్వులను జారీ చేయనున్నట్టు శుక్రవారం స్వయంగా ట్రంపే మీడియాకు తెలిపటం విశేషం.

అమెరికాలో అడుగుపెట్టే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తీరాల్సిందేనంటూ ప్రకటించాడు. మరోవైపు న్యాయస్థానాల నిర్ణయాలపై స్పందిస్తూ.. అది చాలా తప్పుడు నిర్ణయమని, దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైనదని పేర్కొన్నాడు. కొత్త ఆదేశాలు పక్కాగా ఉండబోతున్నాయని సంకేతాలు ఇచ్చాడు. న్యాయం, రాజ్యాంగం ఇవి దేశానికి ముఖ్యం కాదు, భద్రతే అన్నింటికన్నా ప్రధానాంశం. అందుకే ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపాడు. మరోపక్క ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించటమే కాదు, విదేశీ వ్యవహారాలతోపాటు అంతర్గత వ్యాపార సంబంధాలపై పెను ప్రభావం చూపుతాయంటూ 1000 మంది దౌత్యవేత్తలు సంతకాల సేకరణ చేపట్టగా, ఫెడరల్ కోర్టులు ట్రావెల్ బ్యాన్ పై తాత్కాలిక ఊరటనిస్తూ ఆదేశాలు జారీ చేశాయి.

మరోవైపు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీల్ కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే ట్రంప్ ట్రావెల్ బ్యాన్ నిర్ణయాన్ని టెక్సాస్ రాష్ట్రం సమర్థించటం విశేషం.

 

సంబంధిత కథనాలు...

 

ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై స్టే

 

మరో వివాదాస్పద నిర్ణయానికి రెడీ!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  President Donald Trump  Travel Ban  

Other Articles