ఒక స్మార్ట్ ఫోన్.. ఒక ఫ్లాష్ లైట్.. ఒక ట్రంప్ కథ.. తెలుసా..? do not use phone flashlights to read secret documents

Phone flashlights malware present your information to hackers

North Korea, missle test fire, japan, florida, donald trump, shinzo abe, mar-a-lago, flashlight, documents, vulnerable, White House, Sean Spicer, India news, latest news

cellphones are vulnerable to hacking, and it’s a safe bet that the world’s intelligence services have been working overtime to hack into the phones of Trump aides.

ఒక స్మార్ట్ ఫోన్.. ఒక ఫ్లాష్ లైట్.. ఒక ట్రంప్ కథ.. తెలుసా..?

Posted: 02/15/2017 03:16 PM IST
Phone flashlights malware present your information to hackers

శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను అవసరానికి మించి వినియోగంలోకి తీసుకువస్తే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు సాంకేతిక నిఫుణులు. ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్ రంగంలో వస్తున్న మార్పలను అధికంగా వినయోగించుకోవడంతో కష్టాలను కొనితెచ్చుకోవడమే అవుతుందని కూడా చెబుతున్నారు. సాంకేతిక విజ్ఞానం మ‌నిషి అవ‌స‌రాల‌ని తీర్చుకునే క్రమంలో ఎంతగా ఉప‌యోగ‌ప‌డుతుందో అంతే ప్రమాద‌కారిగా కూడా మారుతోందని కూడా చెబుతున్నారు.

వినియోగదారులకు తెలియ‌కుండానే వారికి సంబంధించిన కీల‌క స‌మాచారం నేర‌గాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. సైబ‌ర్ నేర‌గాళ్లు చేస్తున్న ప‌నుల‌ ధాటికి ఎన్నో స‌మ‌స్యలు ఎదురవుతున్నాయి. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగదారులు మరింత జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే తమకు చెందిన సమాచారం సెల్ పోన్ లలో నిక్షిప్తం చేయరాదని ఇప్పటికే నిఫుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన హ్యాకర్లు.. సెల్ ఫోన్ నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు మరో ఫీచర్ ను కూడా కేంద్రంగా చేసుకుంటున్నారు.

ప్రస్తుతం సైబ‌ర్ నేరగాళ్లు ఇత‌రుల కీల‌క స‌మాచారాన్ని చోరీ చేయ‌డానికి స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లాష్ లైట్ ఫీచ‌ర్‌ను ఉప‌యోగిస్తున్నార‌ు. ఔనా ఇది నిజమేనా..? అంటే ఇది ముమ్మాటికీ నిజమేనని నిపుణులు చెబుతున్నారు. మీ ఫోన్ లోని ఫ్లాష్ లైట్ మీ పాలిట దోంగలా అవతరిస్తుందని.. దానిని వినియోగించడంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని అంటున్నారు. వెలుతురు స‌రిగా లేన‌ప్పుడు సెల్‌ఫోన్‌లోని ఫ్లాష్ లైటుని ఆన్‌చేసి డాక్యుమెంట్లను చదువడం, కీలక సమాచారాన్ని ఇతరులకు చూపడం, మ్యాపులు వగైరాలు లాంటి చూడకూడదని ఇది ఎంతమాత్రం మంచిది కాద‌ని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫ్లాష్‌ లైట్‌ కోసం ప్రత్యేకంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లలో సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. యూజ‌ర్‌ ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేయగానే కెమెరా.. ఆడియో సెన్సర్లు కూడా అంతర్గతంగా పనిచేస్తాయని, అప్పుడు మనం ఏదైనా డాక్యుమెంటు ఆ వెలుతురు కింది పెడితే దాన్ని కెమెరా స్కాన్‌ చేసేసి హ్యాకర్లకు చేరవేస్తుంద‌ని హెచ్చరిస్తున్నారు. అలా కీల‌క‌మైన ప‌త్రాల‌ను స్కాన్‌ చేసేసి సైబ‌ర్ నేర‌గాళ్లు నకిలీ పత్రాలను సృష్టిస్తున్నార‌ని పేర్కొన్నారు.

తాజాగా ఈ విధానాన్ని వాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో.. దీనిపై అగ్రరాజ్య భద్రతా దళాలు అందోళన వ్యక్తం చేయగా, దానిపై శ్వేతసౌధం అధికార ప్రతినిధి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, జపాన్‌ అధ్యక్షుడు షింజోఅబే ఇద్దరూ ఓ ప్రైవేట్‌ క్లబ్‌లో సమావేశమై చ‌ర్చిస్తున్నప్పుడు వారి స‌హాయకులు ఫోన్‌ ఫ్లాష్‌టైట్‌ ఆన్‌ చేస్తే ఆ వెలుతురులోనే వారు ప‌లు డాక్యుమెంట్లను చదివారన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.

జపాన్ పర్యవేక్షణలో ఉత్తర కోరియా తాజాగా ప్రయోగించిన క్షిఫణి విజయవంతం అయ్యింది. అది కాకుండా వీరిద్దరు పలు అంశాలపై చర్చించారు. శీతల శ్వేతసౌధంగా ట్రంప్ ముద్దుగా పిలిచే మార్ అ లాగో అనే ప్రైవేటు క్లబ్ లో వీరిద్దరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా కీలక డాక్యూమెంట్లను చదివే క్రమంలో వారు  ఫ్లాష్‌ టైట్‌ను వినియోగించారు. అయితే ఇది ఏమాత్రం సరికాదని సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశంపై స్పందించిన అమెరికా రక్షణశాఖ ట్రంప్‌ ఇప్పటికీ భద్రతలేని వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌నే వాడుతున్నారా? అనే అంశాన్ని పరిశీలిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : japan  florida  donald trump  shinzo abe  mar-a-lago  flashlight  documents  vulnerable  White House  Sean Spicer  

Other Articles