తమ్ముడిని అమ్మాయిలతో చంపించాడా? | Kim Jong Un's half-brother Murder.

Kim jong nam was assassinated

Kim Jong-un, Kim Half-Brother, Kim Jong-nam, Kim Jong-nam poisoned, Kim Jong Un's Half-Brother, Kim Jong-nam Murder, Kim Jong-nam Death, Kim Jong-nam Assassinated,

Female Assassins Killed Kim Jong-un's Half-Brother Kim Jong-nam in Malaysia, Suspects South Korea Woman arrested at Malaysia airport .

ఆ అధ్యక్షుడి తమ్ముడిని ఏసేశారు

Posted: 02/15/2017 04:41 PM IST
Kim jong nam was assassinated

కరడుగట్టిన నియంత, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ సోదరుడి హత్య ఆలస్యంగా వెలుగులోకి రావటం సంచలనంగా మారింది. కిమ్ స‌వ‌తి సోద‌రుడు కిమ్‌ జోంగ్‌ నాం (45) మ‌లేషియాలో హత్య‌కు గురైన‌ట్లు అమెరికా, సౌత్ కొరియాలు వెల్లడించాయి. సోమ‌వారం కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో కిమ్ జాంగ్ నామ్‌పై విష ప్ర‌యోగం జ‌రగ్గా, ఆస్పత్రికి తరలించే క్రమంలోనే అతను ప్రాణాలు వదిలాడు. ఇక అత‌ని హ‌త్య వెనుక కార‌ణ‌మేంటి? ఎవ‌రు హ‌త్య చేశార‌న్న‌ది ఇంకా తెలియ‌లేదు.

కాగా, కిమ్ కి సోదరుడికి గత కొంత కాలంగా పడటం లేదు. నాం తండ్రి కింమ్ జోంగ్-2 బతికున్న సమయంలో ఉన్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించినందుకు అతన్ని రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. కింమ్ జోంగ్ మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలు గమనించిన నాం 2001లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో జపాన్ లో అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేశాడు. అయితే అది విఫలం కావడంతో అమెరికా వెళ్లి కొంత కాలం జీవించాడు. అక్కడ సురక్షితం కాదని భావించిన కింమ్ జోగ్ నాం చైనాలోని మకావు ప్రాంతంలో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు.

ఈ నేపథ్యంలో మలేసియా వస్తూ కౌలాలంపూర్‌ విమానాశ్రయంలో దిగిన కిమ్ జోంగ్ నాంకు ఎయిర్ పోర్టులోనే గుర్తు తెలియని ఇద్దరు మహిళా ఏజెంట్లు విషపు ఇంజెక‌్షన్లు ఇచ్చి మరుక్షణమే మాయమయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన మరణించాడని అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుల ఆచూకీకోసం ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.

కాగా, ఇది కిమ్ జోంగ్ ఉన్ పనేనని అనుమానిస్తున్నారు. 2013లో తన మామ అయిన జాంగ్‌ సాంగ్‌ థెక్‌ కు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అత‌ని హ‌త్యకు ఉత్త‌ర కొరియానే కార‌ణ‌మ‌ని తేలితే.. ఆ దేశ క్రూర‌త్వం, అమానవ‌త్వం బ‌య‌ట‌ప‌డిన‌ట్ల‌వుతుంద‌ని ద‌క్షిణ కొరియా తాత్కాలిక అధ్య‌క్షుడు వాంగ్ క్యొ ఆన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ కేసులో మలేషియా పోలీసులు ఇప్పటికే ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Jong-nam  Kim Jong-un  Half Brother  Muder  

Other Articles