పాత నోట్ల డిఫాజిట్ కు రెండో అవకాశం..? RBI may reopen deposit window for old notes

Another chance to deposit old rs 500 rs 1000 notes

old notes,Economy,Demonetisation,Government,old notes deposit,Rs 500 notes,Rs 1000 notes,RBI,Reserve Bank of India,Old Currency Notes,Money,terrorism,Corruption,Narendra Modi,scrapped notes,Deposits

The Reserve Bank of India (RBI) may allow citizens another chance to deposit the scrapped Rs 500 and Rs 1,000 banknotes

పాత నోట్ల డిఫాజిట్ కు రెండో అవకాశం..?

Posted: 01/26/2017 01:51 PM IST
Another chance to deposit old rs 500 rs 1000 notes

పాత పెద్ద నోట్ల డిపాజిట్ల పై దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వస్తున్న తరునంలో కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చే అవకాశాలు వున్నాయి. ఢిల్లీలో ఇళ్లలో పాచి పనిచేసే మహిళ తన వద్దనున్న నాలుగు వేల పాత నోట్లను మార్చుకునేందుక అర్బీఐ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శనతో నిరసనను వ్యక్తం చేయడం, తమ చనిపోయిన తండ్రికి చెందిన పాత నోట్ల డిఫాజిట్ పై వారసులు బ్యాంకులకు వెళ్లి నిట్టూర్చుతూ వెనక్కు తిరిగి రావడం వంటి ఘటనలతో పాటు దేశవ్యాప్తంగా పలు సంఘటనలు నమోదు కావడంతో కేంద్రం మరో అవకాశం ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

భారతీయ రిజర్వు బ్యాంకు కూడా ఈ విషయమై కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించి.. దేశ ప్రజలకు రద్దయిన పాత నోట్లు మరోమారు బ్యాంకు అకౌంట్లలో డిఫాజిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించే విషయమై నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది. రద్దయిన ఈ పెద్దనోట్లను  మార్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందట.  రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడికి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుందని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ, బ్యాంకు అధికారుల వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ ఈ విషయాన్ని రిపోర్టు చేసింది.

తమ దగ్గర మిగిలిపోయిన పెద్దనోట్ల డిపాజిట్ కు అనుమతించాల్సిందిగా కొంతమంది  కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు  లేఖ రాసినట్టు    పేర్కొంది. అయితే ఈ అవకాశాన్ని చాలా తక్కువ విలువ డిపాజిట్లకు పరిమితం చేయవచ్చని తెలిపింది.  ఈ పరిమితి సుమారు రూ.2వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. కాగా నవంబరు 8న దేశవ్యాప్తంగా రూ.500,1000 పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటన సంచలనం రేపింది.  ఈ నోట్లను బ్యాంకుల్లో మార్పడి  చేసేందుకు  కొన్ని పరిమితులను, ఆంక్షలను విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  scrapped notes  Rs 500  Rs 1000 notes  deposit  RBI  

Other Articles

Today on Telugu Wishesh