కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతున్న నెట్ జనులు netzens slams sujana chowdary on his controversial comments

Netzens slam union minister for his controversial comments

sujana chowdary's tongue slip corners tdp, sujana chowdary controversy, sujana chowdary comments, AP Demands Special Status, vizag, Special Status protest, sujana chowdary, social media, Pawan kalyan, chinni krishna

Union Minister, Sujana Chowdary invited trouble for Chandrababu Naidu, commenting about the movement inspiring from Jallikattu movement in Tamil Nadu made an objectionable state.

కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతున్న నెట్ జనులు

Posted: 01/26/2017 01:02 PM IST
Netzens slam union minister for his controversial comments

ప్రత్యేక హోదా కోసం ఆంధ్రరాష్ట్ర యువత పోరుబాట పట్టింది. యువత, విద్యార్థులు, ప్రజలు ప్రత్యేక హోదాకు సై అంటూ కదం తొక్కుతున్నారు. వైజాగ్‌లో ఎన్ని ఆంక్షలు పెట్టినా, నిషేధాజ్ఞలు విధించినా.. వాటిని ధిక్కరించి పోరుకు సై అంటు కదిలారు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా హోదా నినాదం హోరెత్తుతూనే ఉంది. హోదా కోసం ప్రజలు ఇంతగా తపిస్తున్నా అధికారంలో ఉన్న నేతలకు ప్రజాకాంక్ష ఏమాత్రం పట్టినట్టు కనిపించడం లేదు. కేంద్రమంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి ప్రత్యేక హోదా అవసరమే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

'ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం. ఇంకా దాని గురించి మాట్లాడడం అనవరం' అంటూ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. జల్లికట్టు స్ఫూర్తిగా తీసుకొనే వారు ఏ కోళ్లపందాలో, పందుల పందాలో నిర్వహించుకోవాలని ఆయన నోరుపారేసుకోవడంతో.. ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే సుజనా చౌదరి వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ ఘాటుగా స్పందించగా.. సోషల్‌ మీడియాలో సైతం సుజన, సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది.

ఇప్పటికే కేంద్రమంత్రి సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై సినీ రచయిత చిన్ని కృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. "హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది" అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. పందివైన నీతోనే గేమ్ మొదలు పెడతామని హెచ్చరించాడు. హోదా కోసం పోరాడుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని అన్నాడు. విద్యార్థుల అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని చెప్పుకొచ్చాడు.

సుజనా చౌదరి వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘాటుగా స్పందించారు. ‘యువత పోరాట స్ఫూర్తిని "సుజనా చౌదరి గారు" పందుల పందేల‌తో పోల్చడం చాలా బాధాకరం..’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. మీరు నోరు జారే కొద్దీ యువతని రెచ్చగొట్టటమే అవుతుంద‌ని, సరే అలాగే కానివ్వండని ఆయ‌న పేర్కొన్నారు. మ‌న‌ల్ని వెట‌కారం చేసే గ‌ల్లీ స్థాయి నాయ‌కుడి నుంచి ఢిల్లీ స్థాయి నాయ‌కుడి దాక ప్ర‌తి ఒక్క‌రినీ ఆంధ్ర‌లోని ప్ర‌తి యువ‌కుడు, యువ‌తి గుర్తు పెట్టుకోండని పవన్ సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles