ఆ సీఎం సారుకు.. కాకులకు మధ్య అద్వితీయబంధం.. Crow poops on CM Siddaramaiah's spotless white dhoti

Crow poops on cm siddaramaiah s spotless white dhoti

Siddaramaiah, Crow, Karnataka Chief minister, Pinrayi Vijayan, Kerala Chief minister, Rashtriya Swayamsevak Sangh, Rashtrakavi Manjeshwar Govind Pai, mangaluru development authority, Manjeshwaram, Kerala

Karnataka CM Siddaramaiah has a peculiar connection with crows as a crow was found fluttering over him and atlast drippings fell over his spotless white dhoti.

కాకి శకునం మర్మమేమీ సీఎం సారూ..!

Posted: 01/20/2017 01:34 PM IST
Crow poops on cm siddaramaiah s spotless white dhoti

శీర్షక చూసి ఇదేంటి కాకి శకునం కూడా వుందా..? అన్న డౌట్ కలుగుతుందా..? అంతమాత్రాన ఏకంగా దాని మర్మమేంటని ముఖ్యమంత్రి సారునే అడుగడంలో ఆంతర్యం కూడా అర్థం కావడం లేదా..? అయితే ఇక్కడే వుంది అసలు ట్విస్టు వుంది. ఆ సీఎం సారుకి.. కాకులకీ మధ్య అనుబంధం చాలా వుంది. మరో విధంగా చెప్పాలంటే ఆయనపై కాకులు పగబట్టాయా.? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇంతకీ ఆయనెవరు..? అంటే.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.

గత ఏడాది జూన్ మాసంలో ఆయన ఎంతగానో ఇష్టపడిన కారుపై కూర్చొని ఓ కాకి చాలా హడావుడి చేసింది. దీన్ని అపశకునంగా భావించిన ఆయన... ఏకంగా కారునే మార్చేశారు. అయితే ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తి మూఢవిశ్వాసాలకు పాత్రుడు అవుతున్నాడంటూ.. అప్పట్లో విఫక్షాలు దుమారాన్ని రేపాయి. అయితే అందుకు ఆయన కార్యాలయ వర్గాలు మాత్రం ఆ కారు ఏకంగా మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిందని, అందుచేతనే దానిని వెనక్కు పంపి ముఖ్యమంత్రి ప్రయాణం కోసం కొత్త కారును అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పాయి.

అయితే తాజాగా ఓ కాకి ఆయనపై రెట్ట వేసింది. ఈ ఘటన కేరళలోని కాసరగోడు సమీపంలో ఉన్న మంజేశ్వర్ లో జరిగింది. ఈ ప్రాంతం మంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంజేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న సిద్ధరామయ్యపై కాకి రెట్ట వేసింది. ఆయన తెల్లటి వర్ణ దోతిపై రెట్ట పడింది. వెంటనే పక్కనే ఉన ఓ ఎమ్మెల్యే ఆ రెట్టను తుడిచివేశారు. అదే సమయంలో వేదికపై కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ, మంత్రి రమానాథ రై కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కాకిని తరిమివేశారు.

దీంతో ఇప్పుడు తాజాగా ఆసక్తికరమైన కాకి అంశం చర్చకు దారి తీసింది. అదేమిటంటే... కాకి రెట్ట వేస్తే.. అది శుభసూచకమని కొందరు వాదించడం. సరిగ్గా ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా ఈ విషయమై వేదికపై తన సహచరులతో చర్చించడం కనిపించింది. అయితే ఇది శుభసూచకమేనంటూ వేదికపైనున్న అనేక మంది సెలవిచ్చారని తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తికి ఇంతటి మూడ నమ్మకాలు వుంటే ఎలా అన్న కొత్త వాదన కూడా తెరపైకి వస్తుంది. ఏదిఏమైనా సిద్దరామయ్యకు మాత్రం ఇది మేలు చేస్తుందో..? లేక చేటు చేస్తుందోనన్న విషయం తెలియాలంటే.. కర్ణాటక ఎన్నికల వరకు అగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddaramaiah  Pinarayi Vijayan  Crow  rashtrakavi manjeshwar govinda pai  Manjeshwaram  Kerala  

Other Articles

Today on Telugu Wishesh