సైకిల్ నడుపుతున్న అబ్బాయ్.. బాబాయ్ కి సీటు..! Shivpal finds place in Akhilesh Yadav's first list

Shivpal yadav figures in samajwadi party s list of 191 candidates

uttar pradesh assembly elections, akhilesh yadav, shivpal singh yadav, samajwadi party, Jaswantnagar, Rahul Gandhi, congress, mulayam singh, uttar pradesh

The ruling Samajwadi Party in Uttar Pradesh released its list of 191 candidates for the first three phases of the seven-phase Assembly election starting February 11.

సైకిల్ నడుపుతున్న అబ్బాయ్.. బాబాయ్ కి సీటు..!

Posted: 01/20/2017 03:04 PM IST
Shivpal yadav figures in samajwadi party s list of 191 candidates

కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్ ప్రదేశ్ అధికార పార్టీలో రాజుకున్న వేరు కుంపట్లను చల్లార్చింది. అధికమంది ఎమ్మెల్యేలు మద్దతు వున్న ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ వర్గానకిి తమ పార్టీ గుర్తు సైకిల్ ను కేటాయించడంతో ఇక చడీచప్పుడూ లేకుండా సమాజ్ వాదీ పార్టీలో వర్గాలన్నీ ఏకమయ్యాయి. దీంతో తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి సయోధ్య కుదిరిందో తెలియదు కానీ ఇక అంతా ఒక్కటయ్యే ఐకమత్యేమే మహాబలం అంటూ పాటను అలపిస్తున్నారు. ఈసీ తీసుకన్న నిర్ణయంతో కాసింత వెనక్కు తగ్గిన బాబాయ్ కూడా అఖిలేష్ కు సైకిల్ తోక్కాలని కోరుకున్నాడు. అయితే అఖిలేష్ కూడా తన బాబాయ్ కి సైకిల్ కున్న వెనక సీటును కేటాయించారు.

ఇటీవల పార్టీలో వర్గ పోరు అధికమైనప్పుడు తన సోదరుడు ములాయం సింగ్ తో తమ పార్టీకి చెందిన అభ్యర్థుల జాబితాను శివపాల్ యాదవ్ ప్రకటించారు. అయితే అదంతా ఈసీ ప్రకటన నేపథ్యంలో తుడిచిపెట్టుకుపోయింది. దీంతో అఖిలేష్ తమ పార్టీకి చెందిన 191 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. యులాయం సింగ్ యాదవ్ సూచనమేరకు ఈ జాబితాలో తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కూడా స్థానం కల్పించారు. శివపాల్ కోరుకున్న జస్వంత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆయనకు స్థానాన్ని ఖారురు చేశారు. ఇక అఖిలేష్ కీలక అనుచరులైన అతుల్ ప్రధాన్, అరవింద్ సింగ్ లాంటి వాళ్లకు కూడా ఈ జాబితాలో స్తానం లభించింది.

అన్ని అనుకూలంగా సాగడం.. బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కూడా చోటు ఇవ్వడంతో తండ్రీ కొడుకుల మధ్య పరిస్థితులు చక్కబడ్డాయని సమాచారం. అసలు శివపాల్ యాదవ్, అమర్‌సింగ్‌ ఇద్దరినీ పార్టీ నుంచి పంపేయాలని కూడా ఒక దశలో డిమాండ్ చేసిన అఖిలేష్, ఇప్పుడు తన తొలి జాబితాలోనే బాబాయ్‌కి టికెట్ ఇవ్వడంతో కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడిందన్న సంకేతాలను రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ వర్గాలకు కూడా పంపించారు.

సైకిల్ గుర్తును అఖిలేష్ వర్గానికే కేటాయిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ములాయం 38 మంది అభ్యర్థుల పేర్లతో ఓ జాబితాను కొడుక్కి ఇచ్చారు. వాటిలో శివపాల్ పేరు ఉంది. తండ్రి మాటకు విలువిచ్చిన అఖిలేష్ తన బాబాయ్ కి స్తానం కేటాయించడం కూడా స్వాగతించాల్సని పరిణామమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా వుండగా, కాంగ్రెస్ పార్టీతో మాత్రమే పొత్తు ఉన్నట్లుగా ఈ జాబితాను బట్టి తెలుస్తోంది. తొలి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈ జాబితాలో ప్రకటించారు. ఫిబప్రవరి 11 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assembly elections  akhilesh yadav  shivpal singh yadav  samajwadi party  uttar pradesh  

Other Articles