ఆ వీడియోల మూలంగానే కాల్పులు జరిపాడు | Gunman claimed govt controlled his mind.

Five shot dead at florida fort lauderdale airport

Florida airport shoot, Fort Lauderdale airport fire, Florida airport massacre, Esteban Santiago, US gun culture, Gun fire in America, US gun fire

Florida airport shooting: Gunman identified as discharged US veteran, claimed govt controlled his mind.

అమెరికా ఎయిర్ పోర్ట్ లో కాల్పులు.. 5 మంది మృతి

Posted: 01/07/2017 08:19 AM IST
Five shot dead at florida fort lauderdale airport

అమెరికాలో గన్ కల్చర్ మ‌రోమారు గ‌ర్జించింది. ఫ్లోరిడా విమానాశ్రయం దెబ్బకు రక్తసిక్తమైంది. ఓ దుండ‌గుడు విచ‌క్ష‌ణా ర‌హితంగా జ‌రిపిన కాల్పుల్లో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 45 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కాల్పుల‌తో ఎయిర్‌పోర్టు ఒక్క‌సారిగా భీతావ‌హంగా మారిపోయింది. ప్ర‌యాణికులు హాహాకారాలు చేస్తూ ప‌రుగులు తీశారు.

అలస్కాకు చెందిన 26 ఏళ్ల ఎస్టెబెన్ సాంటియాగో ఇరాక్ లో యూఎస్ సైన్యం తరపున నేషనల్ గార్డుగా సేవలు అందించాడు. సరైన ఫెర్ ఫార్మెన్స్ లేదని చెబుతూ గతేడాది అతన్ని విధుల నుంచి తొలగించారు. దీంతో మానసికంగా అతను కుంగిపోయాడని సోదరుడు చెబుతున్నాడు. నవంబర్ లో తిరిగి అతను ఎఫ్ బీఐ ఆఫీస్ కు తీసుకొచ్చి శిక్షణ పేరిట ఇస్లామిక్ దాడి వీడియోలను పదే పదే చూపించటంతో తీవ్రంగా ప్రభావితుడు అయ్యాడంట.

దీంతో శుక్రవారం ఫోర్ట్ లాడెర్ డెల్ ఎయిర్ పోర్ట్ లోకి గన్ లోకి ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. కనిపించిన వారిపై తుపాకీ గురిపెట్టాడు. శబ్ధాలకు కొందరు బాత్ రూంలలో, మరికొందరు దొరికిన చోటల్లా తలదాచుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేల‌కు దుండ‌గుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిని ఉగ్ర‌దాడిగా అనుమానించిన పోలీసులు, కాసేపటికే అతనో మానసిక రోగి అని మీడియాలో వార్తలు రాగానే స్పష్టమైన ప్రకటన చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gun Fire  America  Florida airport shoot  Fort Lauderdale airport  5 killed  

Other Articles