ఏటీఎం ఛార్జీలు పడుతున్నాయ్ జాగ్రత్త! | debit card, ATM fee changed again.

Atm usage charges are back

debit card fee, ATM fee, demonetization ATM charge, cash-strap, ATM fee charged, ATM usage charges are back, ATM five transactions, charging the ATM transaction fee

Return of debit card, ATM fee worry cash-strapped people.

బ్యాంకు ఖాతాదారులకు మరో షాక్

Posted: 01/03/2017 09:59 AM IST
Atm usage charges are back

నోట్ల రద్దు తర్వాత కరెన్సీ కష్టాలు ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతున్నాయి. క్యాష్ లెస్ లావాదేవీలు, ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ లతో ఇంత కాలం జనాలు గడిపేశారు. అయితే చివర్లో మాత్రం కొత్త నోట్లు వచ్చాయి. దీంతో ఏటీఎంల వద్ద క్యూ కట్టి నోట్లు తెచ్చుకునేందుకు జనాలు సిద్ధపడ్డారు. రద్దు ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో కేవలం 2500 పరిమితి, పైగా ఒక్క 2వేల నోటు మాత్రమే రావటం, చిల్లర కష్టాల నేపథ్యంలో బ్యాంకులు సైతం చార్జీలపై వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

ఏటీఎం లావాదేవీలపై ఉన్నస‌డ‌లింపును ఎత్తివేశాయి కొన్ని బ్యాంకులు. డిసెంబ‌రు 31 వ‌ర‌కు డెబిట్ కార్డును ఏటీఎంలో ఎన్నిసార్లు ఉప‌యోగించినా ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌బోమ‌ని బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ ఇదివ వరకు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌జ‌ల‌కు ఎంతో ఊర‌ట‌నిచ్చింది. అయితే గ‌డువు ముగియటంతో నిన్నటి నుంచి అక‌స్మాత్తుగా వినియోగ‌దారుల మొబైల్ ఫోన్ల‌కు మెసేజ్‌లు వెల్లువెత్త‌డంతో కంగుతిన్నారు.

ఇదివరకు లాగే తొలి ఐదు లావాదేవీల‌కు బ్యాంకులు ఎటువంటి చార్జీలు వ‌సూలు చేయ‌వు. ఆ ప‌రిమితి దాటితే మాత్రం సర్వీస్ చార్జీలు వ‌సూలు చేస్తున్నాయి. నోట్ల ర‌ద్దుకు ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకు, ఐసీఐసీఐ త‌దిత‌ర బ్యాంకులు ప‌రిమితి దాటిన త‌ర్వాత ఒక్కో ట్రాన్సాక్ష‌న్‌కు రూ.15 వ‌సూలు చేస్తుండ‌గా, ఇత‌ర బ్యాంకులు రూ.20 వ‌సూలు చేస్తున్నాయి. కాగా డెబిట్ కార్డుల ట్రాన్సాక్ష‌న్స్‌పై తిరిగి స‌ర్వీసు చార్జీలు వ‌సూలు చేయ‌నున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌పై సదరు బ్యాంకులు మాట్లాడేందుకు నిరాక‌రించ‌డం గ‌మ‌నార్హం.

మరికొన్ని బ్యాంకులు కూడా త్వరలో న‌వంబ‌రు 8వ తేదీకి ముందు ఉన్న నిబంధ‌న‌ల‌ను తిరిగి అమ‌లు చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతున్నాయి. నిజానికి నోట్ల ర‌ద్దుతో మొద‌లైన క‌ష్టాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. 60 శాతం ఏటీఎంలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానేలేదు. అయినా ఏటీఎం చార్జీల రూపంలో ఖాతాదారుల‌ ముక్కు పిండేందుకు సిద్ధ‌మ‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Five Times transactions  debit card  ATM transaction fee  

Other Articles