జైల్లో డ్రగ్స్ గ్యాంగ్ వార్... 60 మందిని కిరాతకంగా చంపేశారు | Almost 60 dead after Brazil drug gangs spark prison riot.

Brazil drug gangs spark prison riot

Brazil Prison, drug gang war, Brazil jail massacre, Brazil drug gangs spark, drug gangs spark prison, Prison riot, Brazil News, Prisoners gang war, Prisoners killed, Decapitated bodies tossed over jail wall, 60 killed Jail massacre

Decapitated bodies tossed over wall after drug gang prison massacre in Brazil.

జైల్లో ఘర్షణ... 60 మంది దుర్మరణం

Posted: 01/03/2017 09:06 AM IST
Brazil drug gangs spark prison riot

బ్రెజిల్ లోని ఓ జైలులో నరమేథం జరిగింది. డ్రగ్స్ గ్యాంగ్ మద్య జరిగిన ఘర్షణ పెను విషాదానికి దారి తీసింది. మనాస్ లోని అమెజాన్ జంగిల్ నగరంలో జైలులో వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో రెండు వర్గాలు దాడులకు తెగబడ్డాయి.

ఈ సందర్భంగా కొంతమంది ఖైదీలు తప్పించుకుని వెళ్లిపోవడం విశేషం. ప్రస్తుతానికి ఈ ఘటనలో మృతిచెందిన ఖైదీల సంఖ్య 60కి చేరుకుందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెజాన్ భద్రతా అధికారి తెలిపారు. ఈ దాడులు ఏ స్థాయిలో జరిగాయంటే... ప్రత్యర్థులను హత్యచేసి, జైలు గోడల ఆవలికి విసిరేయడం జరిగింది. ఈ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అతి కష్టంమీద శాంతియుత వాతావరణం నెలకొల్పినట్టు ఆయన చెప్పారు. కాగా, బ్రెజిల్ జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉంటారని, తరచు గొడవలు జరుగుతుంటాయని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

పలువురిని తుపాకీ కాల్పులతోపాటు గొంతుకోసి, శరీరాలను ఛిద్రం చేసి చంపారు. ఆదివారం మధ్యాహ్నం మొదలైన ఘర్షణలు సోమవారం ఉదయం వరకు కొనసాగాయని ప్రజా భద్రత కార్యదర్శి సెర్గో ఫాంటెస్‌ చెప్పారు. కొందరు ఖైదీలు తప్పించుకున్నారని, జైలు సిబ్బందిలో పలువురిని ఖైదీలు నిర్బంధించారని తెలిపారు. తమపై దాడులు జరక్కుండా చూడాలని డిమాండ్‌ చేసిన ఖైదీలు ఓ జడ్జి మధ్యవర్తిత్వంతో 12 మంది జైలు సిబ్బందిని విడుదల చేయడంతో ఘర్షణలు ముగిశాయి.

జైళ్లలో పట్టుకోసం గత ఏడాది రెండు నేరగాళ్ల ముఠాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు తాజా ఘటనకు కారణమని భావిస్తున్నారు. మరోపక్క.. ఇదే రాష్ట్రంలోని మరో జైలు నుంచి సోమవారం తెల్లవారుజామున 87 మంది ఖైదీలు తప్పించుకోవటం విశేషం. 250 మంది సామర్థ్యం గల జైలులో 2 వేల మంది ఖైదీలను ఉంచటంతోనే ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉంటాయని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brazil Prison  drug gang war  jail massacre  60 killed  

Other Articles

Today on Telugu Wishesh