నోట్ల రద్దు సినిమా హాఫ్ సెంచరీ పూర్తి.. ఏం జ(ఒ)రిగింది? | Demonetization completed 50 days.

50 days for modi economical surgical strike

demonetization, demonetization 50 days, PM Narendra Modi, Modi Demonetization, Demonetization Congress, Demonetization India, Demonetization 2016, Demonetization effect, Demonetization relief, Demonetization Cashless India, Demonetization people, Demonetization Black Money

Demonetization completed 50 days. Has been effective in curbing black money really.

స్పెషల్: కరెన్సీ కష్టాలకు హాఫ్ సెంచరీ...

Posted: 12/28/2016 09:15 AM IST
50 days for modi economical surgical strike

పెద్ద నోట్ల రద్దు.. బ్లాక్ మనీ బయటకు రావటం ఖాయం... నకిలీ నోట్ల ముద్రణ అస్సలు ఉండబోదు. ఇవి దేశ ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న చెప్పిన మాటలు. కొన్ని రోజులు కష్టాలు భరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరికీ అందనంత ప్రగతిని సాధిస్తుందని ప్రకటించాడు. నిర్ణ‌యం వెలువ‌డి నేటికి 50 రోజులు. ‘అచ్చె దిన్’ వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కంతో ప్ర‌జ‌లు ఇన్ని రోజుల‌పాటు మౌనంగా త‌మ క‌ష్టాల‌ను భరించారు. రోజురోజుకు త‌మ ఇక్క‌ట్లు త‌గ్గుతూ వ‌స్తాయ‌ని మురిసిపోయారు. అదే సమ‌యంలో న‌ల్ల‌కుబేరుల‌కు క‌ష్ట‌కాలం మొద‌లైంద‌ని తెగ సంతోష‌ప‌డిపోయారు. మరి అది జరుగుతోందా.. హాఫ్ సెంచరీ రివ్యూ చూద్దాం?

దేశంలో విప‌రీతంగా సంప‌దను పోగేసుకున్న న‌ల్ల‌బాబుల‌ను ఏమీ చేయ‌లేని సామాన్యులు.. ప్రధాని చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పెద్ద నోట్ల ర‌ద్దుతో 'మంచి ప‌ని' జ‌రిగింద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. అయితే వారికేదో జ‌రిగిపోతుంద‌ని భావించిన ప్ర‌జ‌ల‌కు ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు కాస్త తీవ్ర నిరాశ‌ను మిగిల్చాయి. అసలు అనకొండలు కాకుండా, కొసరు వానపాములు మాత్రమే చిక్కుతున్నాయి. నల్ల ధనంను వైట్ గా మార్చుకునేవాళ్లు ఎందరో అయితే.. ఆ క్రమంలో దొరికిపోతున్న వాళ్లు కొందరు మాత్రమే.

మ‌రోవైపు 50 రోజుల త‌ర్వాతైనా చేతికి చాలిన‌న్ని డ‌బ్బు వ‌స్తాయ‌ని భావించిన వారికి స‌ర్కారు న‌గ‌దు ర‌హితం అంటూ చావుక‌బురు చ‌ల్ల‌గా చెప్ప‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నారు. గత నాలుగైదేళ్లలో క్యాష్ లెస్ కి చాలా మందే అలవాటు పడ్డారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా మొత్తం అమలు చేయాలనుకోవటం సరైంది కాదని ఆర్థిక వేత్తలు సైతం అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ప్ర‌భుత్వం మాత్రం వీటిని పట్టించుకోకుండా ముందుకే వెళ్తోంది.

ఆర్బీఐ నుంచి డ‌బ్బులు ఇదిగో వ‌చ్చేస్తున్నాయి, అదిగో వ‌చ్చేస్తున్నాయి అని ప్రభుత్వం చెబుతూ వస్తున్న మాటలు ఇప్పుడిప్పుడే అమలు అవుతున్నాయి. బ్యాంకుల్లో, ఏటీఎంల‌లో కాస్త క్యూలు తగ్గాయి, ఎగ‌తాళి వ్యాఖ్య‌లు కనిపించడం లేదు. ఒక్క రాజకీయ విమర్శలు తప్పా!. అయితే నెలఖారు వచ్చేసింది. జీతాలు పడతాయి. ఈ సమయంలో అసలు పరిస్థితి ఏంటో మరో రెండు, మూడు రోజుల్లో తెలుస్తుంది.

దేశంలో బినామీల పేరుతో పేరుకుపోయిన ఆస్తుల‌ను లాక్కునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లో సంచ‌ల‌నాత్మ‌క చ‌ర్య‌ల‌కు దిగే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. వివిధ రూపాల్లో సంప‌ద‌ను పోగేసుకున్న ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కూడ‌ద‌నే కృత‌నిశ్చ‌యంతో ప్ర‌భుత్వం ఉంది. అదే క‌నుక జ‌రిగితే క‌ష్టాల‌ను పంటికింద బాధ‌ను అణ‌చిపెట్టుకుని నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న ప్ర‌జ‌ల‌కు మోదీ 'రాబిన్‌హుడ్' అవుతారు. లేదంటే న‌ల్ల‌కుబేరుల‌ను ఏమీ చేయలేక, చేతగాని ప్ర‌ధానిగా మిగిలిపోతార‌ు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Economical Surgical Strike  Demonetization  50 days  

Other Articles