నోట్ట రద్దుతో రూ. 8 లక్షల కోట్ల కుంభకోణం Arvind Kejriwal tells UP to 'teach Modi a lesson'

Up voters will punish modi for anti people note ban arvind kejriwal

demonetisation, arvind kejriwal, arvind kejriwal up, arvind kejriwal remark, narendra modi, aam aadmi party, aap, uttar pradesh, uttar pradesh assembly elections, india news, latest news

Delhi CM Arvind Kejriwal alleged that the central government took the demonetisation decision to waive loans of rich businessmen, and appealed to the people of Uttar Pradesh to teach PM Modi a lesson in the forthcoming Assembly elections.

నోట్ట రద్దుతో రూ. 8 లక్షల కోట్ల కుంభకోణం..

Posted: 12/19/2016 11:36 AM IST
Up voters will punish modi for anti people note ban arvind kejriwal

దేశం నుంచి అవినీతి, నల్లధనాన్ని పారద్రోలేందుకు కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం పెద్దనోట్ల రద్దుతో పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని అరోపించారు. తాను మాట్లాడితే భూకంపాలు వస్తాయని రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో భాగంగా చట్టసభల అవరణలో చేసిన వ్యాఖ్యల అనంతరం.. అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రధానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద కూడా వున్నాయని అరోపించడం చర్చనీయాంశంగా మారింది.

కేంద్రం పెద్దనోట్ల నిర్ణయాన్ని తొలినుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. రాహుల్ గాంధీ తరువాత  ప్రధాని మోదీపై ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడిందని అరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద కూడా వున్నాయని అన్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని, ప్రధాని అవినీతిపై తన వద్ద ఆధారాలున్నాయని పేర్కొన్నారు. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా లక్నోలో నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

నోట్ల రద్దు అంటే పరోక్షంగా బడాబాబుల బ్యాంకు రుణాలను రద్దు చేయడమేనని ఆరోపించారు. వారికి లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వానికి రైతుల రుణాలను రద్దు చేసేందుకు మాత్రం చేతులు రావడం లేదన్నారు. ప్రజా వ్యతిరేక, పెద ప్రజల వ్యతిరేక ప్రభుత్వాన్ని అనుకూలంగా రానున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఆయన పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. పేదవారిని కష్టాలకు గురిచేస్తూ.. బడాబాబులను మాత్రం అందలం ఎక్కిస్తున్న బీజేపికి మీరే బుద్ది చెప్పాలని ఆయన యూపీలోని లక్నోలో ఓటర్లను కోరారు. గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి బిర్లా గ్రూప్ నుంచి  భారీగా ముడుపులు అందాయని తేలిందన్నారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ కేజ్రీవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : demonetisation  arvind kejriwal  uttar pradesh  narendra modi  assembly elections  

Other Articles